Begin typing your search above and press return to search.

బాహుబలి 600.. స్పైడర్ 400

By:  Tupaki Desk   |   12 Sep 2017 10:32 AM GMT
బాహుబలి 600.. స్పైడర్ 400
X
యుఎస్ లో మామూలుగా స్టార్ హీరోల తెలుగు సినిమాల్ని 200 స్క్రీన్లకు అటు ఇటుగా రిలీజ్ చేసేవాళ్లు. ఈ మధ్య కాలంలో ఈ నంబర్ కొంచెం పెరిగి కొన్ని సినిమాల్ని 250-300 మధ్య లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ మాత్రం ఏకంగా 600 స్క్రీన్లలో రిలీజైంది. ఐతే ఆ సినిమాను అక్కడ తమిళం.. హిందీలో కూడా రిలీజ్ చేయడంతో కౌంట్ పెరిగింది. మిగతా సౌత్ ఇండియన్ సినిమాలు ఏవైనా కూడా మహా అయితే 300 స్క్రీన్లలోలోపే రిలీజవుతున్నాయి. ఐతే మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ను మాత్రం ఏకంగా 400 లొకేషన్లలో విడుదల చేస్తుండటం విశేషం. నాన్-బాహుబలి సినిమాల్లో ఇది సౌత్ ఇండియన్ రికార్డు కావడం విశేషం.

ఈ 400 లొకేషన్లలోన సెప్టెంబరు 26న ప్రిమియర్లు వేస్తున్నారు. రెగ్యులర్‌గా ప్రిమియర్లు వేసే సమయం కంటే ముందే ‘స్పైడర్’కు ప్రిమియర్లు పడతాయట. అసలే ఎక్కువ లొకేషన్లు.. పైగా ఎక్కువ షోలు పడుతుండటంతో ‘స్పైడర్’ కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. ప్రిమియర్లతోనే కనీసం రెండు మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. వీకెండ్లోనే 5 మిలియన్ క్లబ్బులోకి ఈ సినిమా చేరే అవకాశముంది. యుఎస్ లో మహేష్ కు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అక్కడ తొలి మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరిన తొలి తెలుగు హీరో అతనే. మహేష్ డిజాస్టర్ సినిమాలు ‘ఆగడు’.. ‘బ్రహ్మోత్సవం’ సైతం మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం విశేషం. మురుగదాస్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి ‘స్పైడర్’ యుఎస్ లో మోతెక్కించేయడం ఖాయం.