మొదటి రోజు స్పైడర్ చూడటం కష్టమే

Tue Sep 26 2017 06:51:37 GMT+0530 (IST)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన "స్పైడర్" సినిమా రిలీజ్ డేట్ రానే వచ్చింది. గత ఏడాది నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన ప్రేక్షకుల ఓపిక బుధవారం తో ముగియనుంది. అయితే ఈ మురగదాస్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ముందు నుంచే సినిమాపై అంచనాలు పెరిగాయి. అందులోని స్పై థ్రిల్లర్ అనడంతో అంచనాలు ఇంకా పెరిగాయి.అయితే టీజర్ రిలీజ్ తర్వాత చాలా మంది ప్రేక్షకులు కొంచెం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఆడియోను అయితే అంతగా ఎవరు ఇష్టపడలేదు. హారిస్ జై రాజ్ గత చిత్రాల ట్యూన్స్ రిపీట్ అయ్యాయని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ట్రైలర్ కూడా బాలేదని కౌంటర్లు వచ్చాయి. కానీ ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సినిమాపై ప్రేక్షకులు అంచనాలను ఏ మాత్రం తగ్గించలేదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు టికెట్లు మొత్తం బుక్ అయిపోయాయీ. టికెట్స్ దొరకని వారికి మొదటి రోజు స్పైడర్ ని చూసే ఛాన్స్ మిస్ అయినట్లే అని చెప్పాలి. ఇక ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో మొదటి రోజే స్పైడర్ 1 మిలియన్ డాలర్స్ ను ఈజీగా క్రాస్ చేస్తుందని అర్థమైపోయింది. ఇక తెలుగులో ఎలాగైనా ప్రేక్షకులు సినిమాను చూస్తారు.

తమిళ్ లో మొదటి సారి మహేష్ డైరెక్ట్ గా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడే ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అక్కడ బాగా చేసి తెలుగులో ప్రమోషన్స్ ని చేయడం లేదని కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినబడినా ప్రేక్షకులు మాత్రం మహేష్ సినిమాలో ఉన్నాడు అదే పెద్ద  ప్రమోషన్ అని టికెట్స్ బుక్స్ చేసుకుంటున్నారు. సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మొదటి వారమే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టవచ్చని అంచనాలు వేస్తున్నారు. అందులోను దసరా సెలవులు ఉండడం సినిమాకు బోనస్ అని చెప్పవచ్చు. మరి స్పైడర్  ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.