Begin typing your search above and press return to search.

ఆ పోటీకి ముస్తాబవుతున్న స్పైడర్

By:  Tupaki Desk   |   12 Jan 2018 10:30 AM GMT
ఆ పోటీకి ముస్తాబవుతున్న స్పైడర్
X
ఈ రోజుల్లో చాలా వరకు కొన్ని చిన్న సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే బుల్లి తెరపై ప్రదర్శించబడుతున్నాయి. కొంత మంది స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఎలా ఉన్నాసరే మినిమమ్ ఒక ఆరునెలల తరువాత గాని టీవిలలో ప్రీమియర్స్ పడవు. కానీ ఈ రోజుల్లో అలా లేదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలు చిన్న తెరపై సందడి చేస్తున్నాయి. ఎక్కువగా పండగ టైమ్ లనే టార్గెట్ చేస్తున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సంక్రాంతికి మహేష్ బాబు సినిమా కూడా TRP ల కోసం పోటీపడడానికి సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన స్పైడర్ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 2017 సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది.

ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తవ్వకుండానే సినిమా టీవీ ప్రీమియర్ షోకి సిద్ధమైంది. ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్పైడర్ జీ తెలుగులో ప్రసారం కానుంది. దీంతో మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని తెగ షేర్ చేస్తున్నారు. సినిమా పోటీకి ముస్తాబైంది అంటున్నారు. సినిమా కలెక్షన్స్ పరంగా ఏ మాత్రం హిట్ కాలేదు. మారి TRP లలో ఏమైనా సత్తా చాటుతుందేమో చూడాలి.