అమెరికాలో మహేష్ రేంజ్ అదీ..

Sun Sep 24 2017 12:30:40 GMT+0530 (IST)

ఇంకో మూడు రోజుల్లో ‘స్పైడర్’ విడుదల కాబోతోంది. కానీ శనివారం నాటికే.. అంటే విడుదలకు నాలుగు రోజుల ముందే అమెరికాలో ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్కును దాటేయడం విశేషం. మంగళవారం ప్రిమియర్ల కోసం రెండు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేయగా.. శనివారమే హాఫ్ మిలియన్ మార్కును దాటేసి సంచలనం సృష్టించింది ‘స్పైడర్’. ‘బాహుబలి’ మినహాయిస్తే దక్షిణాదిన మరే సినిమా ఈ ఘనత సాధించలేదు. దీన్ని బట్టే మహేష్ బాబును ఓవర్సీస్ కింగ్ అని ఎందుకంటారో మరోసారి అందరికీ తెలిసొచ్చింది. తెలుగు సినిమాలకు ఇప్పుడు అమెరికాలో ఇంత మార్కెట్ ఉందంటే.. ఆ దిశగా పెద్ద అడుగు వేసింది మహేష్ బాబే.మహేష్ మూవీ ‘దూకుడు’ అమెరికాలో తొలి మిలియన్ డాలర్ సౌత్ ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాలతో భారీ వసూళ్లు అందుకున్నాడు మహేష్. అతడి డిజాస్టర్ మూవీస్ ‘1 నేనొక్కడినే’.. ‘ఆగడు’.. ‘బ్రహ్మోత్సవం’ సైతం అమెరికాలో మిలియన్ మార్కును దాటడం విశేషం. ‘స్పైడర్’ సినిమాను తెలుగు-తమిళ భాషల్లో కలిపి ఏకంగా 400 లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు అమెరికాలో. కాబట్టి నాన్-బాహబులి సౌత్ ఇండియన్ రికార్డు. ఈ సినిమా ప్రిమియర్లతోనే 2 మిలియన్ మార్కు అందుకోగలదని అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే 5 మిలియన్ క్లబ్బులో చేరినా ఆశ్చర్యం లేదు. మహేష్ సినిమాల్లో ‘శ్రీమంతుడు’ 2.87 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది.