Begin typing your search above and press return to search.

మ‌హేష్ త‌మిళం సొల్లాడు!

By:  Tupaki Desk   |   5 Aug 2015 4:04 AM GMT
మ‌హేష్ త‌మిళం సొల్లాడు!
X
కాన్సంట్రేట్ చేయ‌లేక‌పోయారు కానీ... లేదంటే మ‌న హీరోలు తెలుగుతో పాటు త‌మిళంలోనూ సూప‌ర్‌ స్టార్లు గా వెలిగేవాళ్లు. ఇక్క‌డ ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌ హాస‌న్‌, విక్ర‌మ్‌, సూర్య‌ల త‌ర‌హాలో అక్క‌డ మ‌న‌వాళ్లూ బోలెడంత మార్కెట్ సంపాదించుకొనేవాళ్లు. మార్కెట్‌ ని విస్తృతం చేసుకోవ‌డం ఎంత‌ముఖ్య‌మో మ‌న హీరోలు ఇప్పుడిప్పుడే తెలుసుకొంటున్నారు. అందుకే తెలుగు తో పాటు త‌మిళం లోనూ సినిమాలు విడుద‌ల చేసుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. `బాహుబ‌లి` త‌ర్వాత అదే త‌ర‌హాలో మ‌హేష్ `శ్రీమంతుడు` కూడా త‌మిళంలో విడుద‌ల‌వుతోంది. దీంతో చెన్నై లో తెలుగు తార‌ల హ‌డావుడి మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది.

త‌మిళ హీరో ల్లో తెలుగు మాట్లాడేవాళ్లు త‌క్కువే. కానీ మ‌న హీరోల్లో దాదాపుగా అంద‌రూ త‌మిళం మాట్లాడ‌తారు. చెన్నై లో పుట్టి పెరిగిన‌వాళ్లే ఎక్కువ కాబ‌ట్టి. అందుకే మ‌న హీరోలు అక్క‌డ దుమ్ము దులిపేయ‌డానికి మంచి ఆస్కార‌ముంది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవ‌చ్చు. స్టేజీ పైన అచ్చమైన త‌మిళం మాట్లాడి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌చ్చు. `బాహుబ‌లి`తో ప్ర‌భాస్‌, రానా, `శ్రీమంతుడు`తో మ‌హేష్ అదే చేశారు. ప్ర‌భాస్‌, రానాలు కూడా `బాహుబ‌లి`కి సంబంధించిన ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొని త‌మిళం ఇర‌గ‌దీశారు. అలాగే `శ్రీమంతుడు` రీమేక్ `సెల్వంద‌న్‌` కోసం వెళ్లిన మ‌హేష్ కూడా త‌మిళ‌మే సొల్లి అక్క‌డి అభిమానుల్ని ఆక‌ట్టుకొన్నాడు. నిన్న చెన్నై లో జ‌రిగిన ప్ర‌మోష‌న్ ఈవెంట్‌ లో ``నేను ఇక్క‌డే పుట్టాను, ఇక్క‌డే పెరిగాను. చెన్నై తో నాకున్న అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది`` అని త‌మిళంలోనే మాట్లాడాడు మ‌హేష్‌. ఆ మాట‌లు విని ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. త‌మిల్ సెల్వంద‌న్ కూడా శ్రీమంతుడులాగే 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.