Begin typing your search above and press return to search.

మహేష్‌ కాదు.. కొడుకే రియల్ ప్రిన్స్

By:  Tupaki Desk   |   31 Aug 2016 2:18 PM GMT
మహేష్‌ కాదు.. కొడుకే రియల్ ప్రిన్స్
X
మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు కానీ.. టాలీవుడ్ ప్రిన్స్ అని ముచ్చటగా ముచ్చటపడి మరీ అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. వాస్తవానికి మహేష్ చిన్నతనాన్ని గమనిస్తే.. ఈ హీరోని ప్రిన్స్ అనడం కష్టమే. ఎవరికైనా తమ పిల్లలు రాకుమారుల్లానే కనిపిస్తారు కానీ.. మహేష్ అంతటి సౌఖ్యాల్లో ఏమీ పెరగలేదు.

చాలాకాలం పాటు ఊటీలోని స్కూల్లో చదువుకున్నాడు మహేష్ బాబు. అక్కడ అందరు పిల్లల మాదిరిగానే మహేష్ కూడా ఒకడంతే. పైగా సమ్మర్ లో మాత్రం చైల్డ్ యాక్టర్ గా సినిమాలు చేస్తూ గడిపేసేవాడు. పెద్ద హంగామాతో రాకుమారుడి మాదిరిగా మహేష్ చైల్డ్ హుడ్ గడవలేదు. కానీ మహేష్ కొడుకు గౌతమ్ సంగతి అలాకాదు. అడుగు తీసి అడుగు వేయాలంటే విమానాలను అరేంజ్ చేయగల రేంజ్ మహేష్ ది. అంతే కాదు.. రీసెంట్ గా ఈ జూనియర్ మహేష్ బర్త్ డేని దుబాయ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.

పుట్టిన రోజు కోసం ఫ్యామిలీతో కలిసి ఇండియా నుంచి దుబాయ్ వెళ్లాడు గౌతమ్. 'నా కుమారుడు గౌతమ్ ఇవాల్టితో పది వసంతాలు పూర్తి చేసుకుంటున్నాడు. ఇది ఎంతో అందమైన సుదూర ప్రయాణం. దేవుడు అన్నీ అందించాలని కోరుకుంటున్నా' అంటూ మహేష్ వైఫ్ నమ్రత ట్వీట్ చేసింది. అంతే కాదు.. అక్కడి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది గౌతమ్ తల్లి. ఇప్పుడు చెప్పండి.. రియల్ ప్రిన్స్ మహేష్ బాబా.. లేక మహేష్ కొడుకా?