కోర్టుకు వెళ్ళకుండానే సెటిల్ చేసిన మహేష్?

Tue Jun 12 2018 15:39:21 GMT+0530 (IST)

బ్రహ్మోత్సవం - స్పైడర్ సినిమాలు ఫ్లోప్ అవ్వడంతో కెరీర్ లో బాగా డీలా పడిపోయిన మహేష్ బాబుకి భరత్ అనే సినిమా హిట్ అవ్వడంతో జోష్ వచ్చింది. ఇదిలా ఉండగా మహేష్ బాబుకి - వంశీ పైడిపల్లికి - పీవీపీ కి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. దానిని ఉల్లంఘించాడు మహేష్ అని రూమర్లు మనం వింటూనే వచ్చాం.బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అయిన సమయంలో మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. బ్రహ్మోత్సవం వల్ల నష్టపోయిన పీవీపీ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది. అడ్వాన్స్ గా కొంత మొత్తాన్ని కూడా మహేష్ కు ముట్టజెప్పాడట పీవీపీ. కాకపోతే భరత్ అనే నేను సినిమా మొదలవ్వకముందే..  దిల్ రాజు అండ్ అశ్విని దత్ లతో ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు మహేష్. అందుకే పీవీపీ మహేష్ బాబు మరియు వంశీ పైన పివిపి కోర్టు కేస్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి. తాజా రిపోర్టుల ప్రకారం మహేష్ కోర్ట్ దాకా వెళ్ళకుండానే ఈ విషయాన్ని సెటిల్ చేసేశాడట.

పీవీపీ పెద్ద ప్రొడక్షన్ బ్యానర్. ఇప్పుడు వారితో గొడవలు - కోర్టు కేసులు ఈ గోలంతా ఎందుకు అని అనుకున్న మహేష్.. కొంత మొత్తాన్ని పివిపికి ముట్టజెప్పి.. ఆ విషయాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాడట. మొత్తానికి ప్రాబ్లెమ్ అయితే సాల్వ్ అయిపోయినట్టే అంటున్నారు సన్నిహితులు. మహేష్-వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ ఇంకో పది రోజుల్లో మొదలవనుంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు అని తెలిసిన విషయమే.