Begin typing your search above and press return to search.
ఎన్టీఆరే బెస్ట్ డ్యాన్సర్ - మహేష్
By: Tupaki Desk | 17 May 2016 11:07 AM ISTమొన్ననే ఎన్టీఆర్ - చరణ్ ల్లాగా నేను డ్యాన్సులేయలేను అని చెప్పారు పవన్ కళ్యాణ్. అంటే పవన్ దృష్టిలో ఎన్టీఆర్ - చరణ్ లు బెస్ట్ డ్యాన్సర్లనే అర్థం. తాజాగా మహేష్ బాబు కూడా అదే మాట అన్నాడు. ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే ఎన్టీఆరే అన్నాడు. తన స్టెప్పులు చాలా బాగుంటాయని కితాబునిచ్చాడు.
బ్రహ్మోత్సవం ప్రచారంలో భాగంగా రోజూ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు మహేష్. ఈ సందర్భంగా తన మనసులో వున్న పలు విషయాల్ని బయటపెడుతున్నాడాయన. కథానాయికల్లోనూ సమంత - కాజల్ లంటే ఇష్టమని చెప్పిన ఆయన తాజాగా ఎన్టీఆర్ డ్యాన్సుల్ని మెచ్చుకున్నాడు. అయితే డ్యాన్సుల గురించి అందరూ ఎన్టీఆర్ ని ఆకాశానికెత్తేస్తుంటే ఆయన మాత్రం ఇక మునుముందు ఆ రేంజిలో డ్యాన్సులేయలేనేమో అంటున్నాడు. చేయాల్సిందంతా చేసేశాం, ఇంకా ప్రతీ సినిమాకీ అంతకంతకు ఎక్కువ చేయాలంటే కష్టమైపోతుందని చెబుతుంటాడు ఎన్టీఆర్. మాట వరసకు ఆయనలా అంటుంటాడు కానీ... కొత్తగా ఏ సినిమా చేసినా తనదైన స్టైల్ ఆఫ్ డ్యాన్స్ ని చూపించి మళ్లీ అభిమానుల్ని అలరిస్తుంటాడు. నిజంగా డ్యాన్సుల్లో చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో అదరగొడుతున్న కథానాయకులంటే ఎన్టీఆర్ - చరణ్ - అల్లు అర్జున్ లే.