Begin typing your search above and press return to search.

పది కోట్లు వెనక్కిచ్చేసిన మహేష్

By:  Tupaki Desk   |   24 Nov 2015 11:40 AM GMT
పది కోట్లు వెనక్కిచ్చేసిన మహేష్
X
దర్శకుడే కెప్టెన్.. నిర్మాతే అందరి కంటే మిన్న.. అనే మాటలు వింటుంటాం కానీ.. వాస్తవానికి మన దగ్గర హీరోలదే రాజ్యం. ఎవ్వరైనా హీరోల వెంట పడాల్సిందే. కథ - దర్శకుడు ఏదీ ఖరారు కాకున్నా.. స్టార్ హీరో డేట్లుంటే చాలు ఆ నిర్మాతను మించిన వాడుండడు ఇండస్ట్రీలో. ముందు స్టార్ హీరోతో కమిట్ మెంట్ తీసుకుని.. అడ్వాన్స్ ఇచ్చేస్తే మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చని అనుకుంటారు నిర్మాతలు. హీరోల కళ్లు చెదిరే ఫిగర్ చెక్కు మీద వేసి వారిని కమిట్ చేయించడంలో నిర్మాతలు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఇలా హడావుడిగా మహేష్ ను కమిట్ చేయించిన నిర్మాత రాధాకృష్ణ.. ఇప్పుడు తన చెక్కు రిటర్న్ వచ్చేయడంతో అవాక్కయ్యారు.

తన సన్నిహితుడైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించాలని చూశాడు హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా మొదలు పెట్టాలనుకున్నాడు. మహేష్ కు పది కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. కానీ మురుగదాస్ సినిమాకు కమిటైన నేపథ్యంలో వచ్చే ఏడాదంతా మహేష్ ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు. త్రివిక్రమ్ కు కూడా వేరే కమిట్ మెంట్ లు ఉండటంతో మహేష్ సినిమాపై క్లారిటీతో లేడు. పరిస్థితి గమనించి అడ్వాన్స్ తన దగ్గర పెట్టుకోవడం సమంజసం కాదని.. అమౌంట్ రిటర్న్ చేశాడట మహేష్. నిర్మాత ఇచ్చిందానికి వడ్డీ కూడా కలిపి వెనక్కి ఇచ్చి మహేష్ తన కమిట్ మెంట్ ను చాటుకున్నట్లు చెబుతున్నారు. అదే నిజమైతే నిర్మాతల శ్రేయస్సు కోరడంలో మహేష్ తండ్రికి తగ్గ తనయుడే.