Begin typing your search above and press return to search.

పూరికి కౌంట‌ర్ ఇచ్చిన మ‌హేష్‌

By:  Tupaki Desk   |   1 May 2016 4:04 AM GMT
పూరికి కౌంట‌ర్ ఇచ్చిన మ‌హేష్‌
X
పెద్ద సినిమాలకు భారీ న‌ష్టాలు వాటిల్లిన‌పుడు నిర్మాత‌లు చెల్లించాల్సిందే అని ప‌ట్టుబ‌ట్ట‌డం ఇంత‌కుముందు కోలీవుడ్ లోనే ఉండేది. ఈ మ‌ధ్య టాలీవుడ్ లో కూడా ఇలాంటి వివాదాలు న‌డుస్తున్నాయి. లోఫ‌ర్ సినిమాకు సంబందించి పూరి జ‌గ‌న్నాథ్ కు డిస్ట్రిబ్యూట‌ర్ల మ‌ధ్య పెద్ద గొడ‌వే న‌డిచింది. లాభాలు స్వీక‌రిస్తున్న‌పుడు న‌ష్టాల‌కు సిద్ధ‌ప‌డాలి క‌దా అని లా పాయింట్ తీసి.. డిస్ట్రిబ్యూట‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు పూరి. ఆయ‌న‌కు కొంద‌రు మ‌ద్ద‌తుగా మాట్లాడితే.. ఇంకొంద‌రు డిస్ట్రిబ్యూట‌ర్ల వైపు నిలిచారు.

ఐతే పూరికి స‌న్నిహితుడైన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మాత్రం పూరి వాద‌న‌కు భిన్న‌మైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. డిస్ట్రిబ్యూట‌ర్ల వివాదానికి సంబంధించి ఓ ఇంట‌ర్వ్యూలో త‌న అభిప్రాయం చెబుతూ.. ‘‘నా సినిమా బాగా ఆడినా.. ఆడ‌క‌పోయినా దానికి సంబంధించి నేను బాధ్య‌త తీసుకోవాల్సిందే అని భావిస్తాను’’ అని మ‌హేష్ బాబు చెప్పాడు. అంటే బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు వస్తే బాధ్య‌త తీసుకుని ఆదుకోవాల‌ని చెప్ప‌క‌నే చెప్పాడు మ‌హేష్‌. మ‌హేష్ కెరీర్ లో పెద్ద డిజాస్ట‌ర్లుగా నిలిచిన 1 నేనొక్క‌డినే.. ఆగ‌డు సినిమాల‌కు సంబంధించి బ‌య్య‌ర్ల‌కు కొంత‌వ‌ర‌కు సెటిల్ చేసిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. గ‌త ఏడాది శ్రీమంతుడు సినిమాతో బ‌య్య‌ర్ల‌కు క‌న‌క‌వ‌ర్ష‌మే కురిపించాడు మ‌హేష్‌.