Begin typing your search above and press return to search.

మహేష్ 25వ సినిమా.. వాటే ప్లానింగ్

By:  Tupaki Desk   |   21 Nov 2017 10:37 AM GMT
మహేష్ 25వ సినిమా.. వాటే ప్లానింగ్
X
మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పైడర్ మూవీ నిరుత్సాహపరిచినా.. మహేష్-కొరటాల కాంబినేషన్ పై ఉన్న కాన్ఫిడెన్స్ కారణంగా.. కొత్త సినిమాకు మంచి ఆఫర్సే వస్తున్నాయని టాక్.

మరోవైపు తన తర్వాతి సినిమా అయిన తన 25వ సినిమా విషయంలో కూడా మహేష్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడట. కొరటాల మూవీ ఫినిష్ కాగానే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీని స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. పైగా.. ఈ మూవీ షూటింగ్ కు ఎక్కడా బ్రేక్ ఉండదట. ఒకట్రెండు రోజులు మినహాయిస్తే.. అసలు చిన్నపాటి బ్రేక్ కూడా లేకుండా షూటింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పీక్ స్టేజ్ లో ఉండగా.. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగిపోతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. ఇప్పటికే మూడు పాటలకు ట్యూన్స్ కూడా సిద్ధమైపోయినట్లు చెబుతున్నారు.

అసలు బ్రేక్ లేకుండా మహేష్ నిజంగా షూటింగ్ పూర్తి చేస్తే మాత్రం రికార్డ్ అనాల్సిందే. ఒకవైపు తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ.. సినిమాలు చేస్తాడని మహేష్ కు పేరుంది. కానీ వంసీ పైడిపల్లి సినిమా విషయంలో మాత్రం ముందు నుంచి ప్లానింగ్ తో.. ఫుల్ స్పీడ్ లో.. గ్యాప్ లేకుండా సినిమా చేస్తాడనే టాక్.. ఆశ్చర్యం కలిగిస్తోంది.