Begin typing your search above and press return to search.

థాయ్‌ బీచ్‌ లో బుల్లి ప్రిన్స్‌ సెలబ్రేషన్స్‌

By:  Tupaki Desk   |   29 Aug 2015 7:34 AM GMT
థాయ్‌ బీచ్‌ లో బుల్లి ప్రిన్స్‌ సెలబ్రేషన్స్‌
X
బుల్లి బుజ్జాయి ప్రిన్స్‌ గౌతమ్‌ కృష్ణ పుట్టినరోజు ఈనెల 31న. మరి సెలబ్రేషన్స్‌ ఎక్కడ? కృష్ణ -మహేష్‌ సేనాని సెలబ్రేషన్స్‌ కి రెడీ అవుతున్నారా? లేదా? ఇలాంటి సందేహాలకు సమాధానం దొరికేసింది. బుల్లి ప్రిన్స్‌ గౌతమ్‌ ప్రస్తుతం ఇక్కడ లేడు. ఆల్రెడీ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ కోసం థాయ్‌ ల్యాండ్‌ వెళ్లాడు. అక్కడ 'కో సమూయ్‌' అనే బీచ్‌ పరిసరాల్లో ఫుల్లుగా చీరప్‌ మూడ్‌ లో ఉన్నాడు.

నిత్యం ఫాదర్‌ మహేష్‌ తో కలిసి బీచ్‌ లోని ఇసుక తిన్నెల్లో పరుగులు పెట్టి, సముద్ర స్నానాలాడి, అక్కడే వాటర్‌ స్పోర్ట్స్‌ లో ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈసారికి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ కూడా అక్కడే. కాబట్టి ప్రిన్స్‌ అభిమానులు ఇక్కడ తమవంతు సెలబ్రేషన్స్‌ నామమాత్రంగా చేసుకుంటారంతే. ప్రిన్స్‌ కి ఒకేసారి రెండు పండగలు కలిసొచ్చాయి. ఓవైపు శ్రీమంతుడు సక్సెస్‌, మరోవైపు గౌతమ్‌ పుట్టినరోజు పండుగ. ఇవి రెండిటినీ ఫుల్లుగా థాయ్‌ బీచ్‌ లో చీరప్‌ చేసుకుంటున్నాడు. నమ్రత, గౌతమ్‌, సితార ఇలా ఫ్యామిలీ మొత్తం కో సముయ్‌ బీచ్‌ లో పండుగ చేసుకుంటున్నారు.

శ్రీమంతుడుతో సంఘంలో గౌరవం పెరిగింది. నాలో పరిణతి పెరిగింది. మానవత ఇనుమడించింది. ఇన్ని విశేషాలు జీవితంలోకి వచ్చాయ్‌.. అందుకే ఈ సెలబ్రేషన్స్‌. సెప్టెంబర్‌ రెండో వారం నుంచి శ్రీకాంత్‌ అడ్డాలతో 'బ్రహ్మూెత్సవం' షూటింగులో పాల్గొంటున్నా.. అని ప్రిన్స్‌ చెప్పాడు.