Begin typing your search above and press return to search.

డేంజర్ లో ప్రిన్స్ ఓవర్సీస్ మార్కెట్!

By:  Tupaki Desk   |   10 May 2019 9:29 AM GMT
డేంజర్ లో ప్రిన్స్ ఓవర్సీస్ మార్కెట్!
X
ఓవర్సీస్ లో ప్రిన్స్ గా చెప్పుకునే మహేష్ బాబు మార్కెట్ అక్కడ తగ్గిందా అంటే ఔననే సమాధానమే వస్తోంది. నమోదవుతున్న వసూళ్లు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవడం పరిస్థితిని సూచిస్తున్నాయి. ఎన్నో అంచనాలతో చరిత్ర తిరగరాస్తుంది అని ఆశించిన మహర్షి ప్రీమియర్ల నుంచి మొదటి రోజే కేవలం $500K మాత్రమే రాబట్టడం అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.

ఈ మాత్రం వసూళ్లు ఎప్పుడో ఐదారేళ్ళ క్రితమే మహేష్ ఫ్లాప్ మూవీస్ కూడా తెచ్చి పెట్టాయి. ఇమేజ్ ఇంత పెరిగాక ధరల్లో చాలా వ్యత్యాసాలు వచ్చాక కూడా ఈ ఫిగర్స్ అంటే ప్రిన్స్ మార్కెట్ మీద అనుమానాలు రేపేవే. అయితే ఇది వీక్ ఎండ్ కు ఎర్లీ గా చెప్పుకునే గురువారం కాబట్టి ఇలా జరిగింది అనుకోవడానికి లేదు.

మహానటి గత ఏడాది రిలీజయ్యింది కూడా ఇదే తేదీనే. ఆ రోజు బుధవారం. అయినా కలెక్షన్స్ చూసి ట్రేడ్ కు షాక్ కొట్టింది. పైగా అందులో స్టార్లు లేరు. చనిపోయిన ఓ హీరొయిన్ బయోపిక్. ట్రాజెడీ ఎండింగ్. రిలీజ్ కు ముందు వరకు ఎలాంటి అంచనాలు లేవు. గీత గోవిందం వచ్చింది కూడా గురువారమే.

ఇవన్ని ఓవర్ సీస్ లోనూ సత్తా చాటిన బ్లాక్ బస్టర్స్. అంతెందుకు అజ్ఞాతవాసి సైతం త్వరగా మిలియన్ మార్క్ అందుకుంది డిజాస్టర్ అయినా కూడా. ఇవన్ని పరిగణనలోకి తీసుకునే మహర్షి ప్రీమియర్లకు సూపర్ రెస్పాన్స్ రాకపోవడం ఎన్నో అనుమానాలకు తెరతీసింది.స్టార్లను గుడ్డిగా నెత్తిన బెట్టుకునే సీన్ లేదని తేటతెల్లం చేసింది. మరి మహేష్ విషయంలో ఇది ఎందుకు జరుగుతోందో కాలమే బదులు చెప్పాలి