మహేష్ బాబు.. నాన్న ప్రేమ అలా ఉంది!

Wed May 22 2019 22:36:06 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఫ్యామిలీ మ్యాన్. అప్పట్లో రేమాండ్స్ యాడ్ ఒకటి వస్తూ ఉండేది. ఆ యాడ్ కు 'ది కంప్లీట్ మ్యాన్' అనే క్యాప్షన్ ఉండేది. మన సూపర్ స్టార్ ఆ క్యాప్షన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు.  'మహర్షి' ప్రమోషన్స్ కు బై బై చెప్పిన మహేష్ ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.  మహేష్ తన సతీమణి నమ్రత.. పిల్లలు గౌతమ్.. సితారతో ఫ్యామిలీ టైం ను ఎంజాయ్ చేస్తున్నాడు.సహజంగా మహేష్ ఫ్యామిలీ ఎప్పుడు టూర్స్ కు వెళ్ళినా హైలైట్ అయ్యేది మాత్రం మహేష్ గారాలపట్టి సితార పాప.  అసలే ఇంటిమహాలక్ష్మి.. పైగా ఇంట్లో చిన్నది కావడంతో ఫోకస్ అంతా సితార పాప పై ఉంటుంది.  గౌతమ్ మాత్రం 'అన్నయ్య' లాగా ఎప్పుడూ డీసెంట్ గా ఉంటాడు. మహేష్ కూడా సితారను ముద్దు చేసినట్టు కనిపిస్తాడు కానీ గౌతమ్ ను అలా ముద్దు చేసినట్టు కనిపించడు. కానీ మహేష్ తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ తాజా ఫోటో చూస్తె మాత్రం మహేష్ కు గౌతమ్ అంటే ఎంత ఇష్టమో.. 'నాన్న ప్రేమ' ఎలా ఉందో తెలిసిపోతుంది.

వైట్ టీషర్ట్.. బ్లాక్ షార్ట్స్ లో ఉన్న గౌతమ్ ను గట్టిగా పట్టుకొని చెవిలో ఏదో చెప్తూ ముద్దు చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఫోటో మహేష్ ఫ్యాన్స్ కు ఒక బ్యూటిఫుల్ మెమొరీ గా నిలిచిపోతుంది. సూపర్ స్టార్ నాన్న ప్రేమ తట్టుకోలేక నవ్వుల్లో మునిగిపోయాడు గౌతమ్. ఈ ఫోటోకు మహేష్ ఇచ్చిన క్యాప్షన్ "హ్యాపినెస్ #సెలబ్రేటింగ్ మహర్షి".   ఈ ఫోటోకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది.  ముఖ్యంగా మహేష్ అభిమానులు లైకులతో హోరెత్తిస్తున్నారు.