Begin typing your search above and press return to search.

అడ్డాలకు అడ్డు పడుతున్న మహేష్

By:  Tupaki Desk   |   27 May 2016 5:19 AM GMT
అడ్డాలకు అడ్డు పడుతున్న మహేష్
X

బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఫారిన్ టూర్ వెళ్లిపోయాడు. లండన్ లో తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ను ముందుగానే ప్లాన్ చేసుకున్న మహేష్.. షెడ్యూల్ ప్రకారం ఫ్లైట్ ఎక్కేశాడు. గతంలో శ్రీమంతుడు విషయంలో రిలీజ్ తర్వాత కూడా రెండు వారాల పాటు ప్రమోషన్స్ చేసిన మహేష్.. బ్రహ్మోత్సవంకు రెండో రోజు నుంచే సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఇందుకు ఆ మూవీకి వచ్చిన టాక్ - రిజల్ట్ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయితే.. ఇలా లండన్ వెళ్లే ముందు మహేష్ చెప్పిన మాటలు అందరికీ షాక్ కలిగించాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల విషయంలో మహేష్ చేసిన కామెంట్స్ గురించి ఇండస్ట్రీ జనాలు తెగ మాట్లాడేసుకుంటున్నారు. 'బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ విషయంలో దర్శకుడిపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దు. దీనికి నేనే బాధ్యత వహించాలని అనుకుంటున్నాను. ఈ స్టోరీకి అడ్డాలను ఎంపిక చేసుకోవడం నా తప్పే. నా జడ్జ్ మెంట్ లో లోపమే సినిమ ఫెయిల్యూర్ కి రీజన్' అని సన్నిహితులతో అంటున్నాడట మహేష్.

బ్రహ్మోత్సవం విషయంలో పూర్తి రెస్పాన్సిబిలిటీ మహేష్ తీసుకోబోతున్నాడని అర్ధమైపోతోంది. ఇప్పటివరకూ అందరూ శ్రీకాంత్ అడ్డాలను బ్లేమ్ చేస్తుండడం, డైరెక్టర్ నే కార్నర్ చేస్తుండడంతో.. మహేష్ ఈ డెసిషన్ తీసుకున్నాడని అంటున్నారు.