Begin typing your search above and press return to search.

మహేష్ భలే మెరిసిపోతున్నాడబ్బా!!

By:  Tupaki Desk   |   6 May 2016 4:45 PM GMT
మహేష్ భలే మెరిసిపోతున్నాడబ్బా!!
X
మే నెల మొదటి నుంచి మొదలుపెట్టి.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సందడి చూస్తుంటే.. అభిమానులకు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నట్లుగా ఉంది. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా వరుసగా పోస్టర్స్ - అప్ డేట్స్ - సాంగ్ ప్రోమో - లిరికల్ సాంగ్ - విషెస్ పోస్టర్ - మేకింగ్ వీడియో.. ఇలా ఏదో ఒక పేరు చెప్పి కొత్త కొత్తగా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు బ్రహ్మోత్సవం టీం. ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కీలకమైన రోజు రానే వచ్చేసింది.

మే 7న బ్రహ్మోత్సవం ఆడియో విడుదల కోసం మహేష్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా గురించిన సంగతులు - రిలీజ్ డేట్ కబుర్లను సూపర్ స్టార్ నోటి వెంట వినచ్చన్నది వాళ్ల ఆశ. ఇప్పుడు ఆడియో రిలీజ్ పోస్టర్ కూడా వచ్చేసింది. ఈ పోస్టర్ లో మహేష్ బాబును చూస్తే.. ఎవరికైనా సరే కళ్లు కుట్టాల్సిందే. అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు మహేష్. అది కూడా కలర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ముందు మహేష్ ఇలా మెరిసిపోతుండడం గమనించాల్సిన విషయం.

ఖాళీ బ్యాక్ గ్రౌండ్ లో కేరక్టర్ ని కలర్ ఫుల్ గా చూపించడం వేరు. కానీ ఈ పోస్టర్ లో మహేష్ బాబు వెనుకే బోలెడన్ని కలర్స్ ఉన్నాయి. అన్నిటి ముందు కూడా బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ టీషర్ట్ - ఖాకీ ఫ్యాంట్ - వైట్ షూస్.. చెప్పడానికి సింపుల్ గా ఉన్నా.. ఆ డ్రసింగ్ లో మహేష్ కురిపిస్తున్న మెరుపుల ముందు.. ఎలాంటి వెలుగులైనా దిగదుడుపే. దటీజ్ మహేష్!!