Begin typing your search above and press return to search.

మహేష్ ఆ టైటిల్ పెట్టుకోడు.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   23 Feb 2017 9:59 AM GMT
మహేష్ ఆ టైటిల్ పెట్టుకోడు.. ఎందుకంటే?
X
మహేష్ కొత్త సినిమాకు ‘సంభవామి’ అనే టైటిల్ చాన్నాళ్ల నుంచి ప్రచారంలో ఉంది. ఐతే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు ఇంతవరకు. ఇంతలో ‘విన్నర్’ ఆడియో వేడుకలో నిర్మాత పొట్లూరి వరప్రసాద్ మాట్లాడుతూ మహేష్ సినిమా టైటిల్ ‘సంభవామి యుగేయుగే’ అని చెప్పాడు. మహేష్-మురుగదాస్ నిర్మాతల్లో ఒకడైన ఠాగూర్ మధు.. పీవీపీకి సన్నిహితుడు కావడంతో ఆయన కన్ఫమ్ చేశాకే పీవీపీ ఈ టైటిల్ గురించి ప్రకటించి ఉంటారని అందరూ ఫిక్సయిపోయారు. కానీ రెండు రోజులు గడిచాక కానీ అసలు విషయం అర్థం కాలేదు. మహేష్-మురుగదాస్ మూవీకి ‘సంభవామి యుగేయుగే’ టైటిలే ఫిక్స్ కాలేదని ఆ చిత్ర పీఆర్వో మీడియాకు స్పష్టం చేశాడు. దీన్ని బట్టి పీవీపీ మీడియాలో వస్తున్న వార్తలు విని.. ‘సంభవామి యుగేయుగే’ అనే టైటిల్ అనేసినట్లు అర్థమవుతోంది.

అసలు ‘సంభవామి యుగేయుగే’ అనే టైటిల్ ను ఆల్రెడీ తెలుగులో వాడేశారు. ఆ పేరుతో సినిమా వచ్చి ఎంతో కాలం కూడా కాలేదు. ఆ పేరుతో సినిమా తీసింది క్రిష్ అని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ‘గమ్యం’ చేయడానికంటే ముందు క్రిష్ కొత్త వాళ్లతో తీసిన ‘సంభవామి యుగేయుగే’ అనే సినిమాలో పెట్టుబడి పెట్టాడు. ఐతే ఆ సినిమా విడుదలైన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఐతే ఆ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వచ్చినప్పటికీ.. ఓ చిన్న సినిమా కోసం వాడేసిన టైటిల్ మహేష్ చిత్రానికి పెట్టుకుంటారా అన్నది డౌటే. ఐతే ఈ చిత్ర నిర్మాతలు ‘సంభవామి’ అనే టైటిల్ రిజిస్టర్ చేసిన మాట మాత్రం వాస్తవం. ఇంతకీ అసలు మహేష్.. మురుగదాస్ ఆలోచనల్లో అసలే టైటిల్ ఉందో.. దాన్ని ఎప్పుడు బయటపెడతారో అని అభిమానులు వెయిటింగ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/