ఫోటో స్టోరీ: మహేష్ ఊసరవెల్లి?

Tue Sep 18 2018 15:34:35 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ 40 ప్లస్ లోనూ అదే గ్లామర్ ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? ఆ సీక్రెట్ ఏంటి?  యువతరంలో నిరంతరం ఇదో హాట్ టాపిక్. దాదాపు 20 ఏళ్ల కెరీర్ లో అతడు నటించింది కేవలం 25 సినిమాలు మాత్రమే. ప్రస్తుతం వంశీ పైడపల్లి దర్శకత్వంలో 25వ సినిమా సెట్స్ పై ఉంది. మహర్షి అనే టైటిల్ ని లాంచ్ చేశారు. ఈ సినిమాలో మహేష్ నెవ్వర్ బిఫోర్ లుక్ తో కనిపించబోతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూశాక అంత స్మార్ట్ గా ఎలా ఉన్నారు? అంటూ ఒకటే డిస్కషన్ సాగింది.ఇదిగో లేటెస్టుగా మరో ఫోటో ఆన్ లైన్ లో లీకైంది. ఈ లుక్ రియల్లీ ఫెంటాస్టిక్ అన్న టాక్ వినిపిస్తోంది. బ్లూ లెదర్ జాకెట్ - ఇన్ సైడ్ బ్లాక్ కాంబినేషన్ నెక్ టీస్ తో అల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తున్నాడు. కార్ లోంచి కార్పొరెట్ గురూలా దిగి ఆ చూపులతోనే కాల్చేస్తున్నాడు. మునుపటితో పోలిస్తే ఇంకా యంగ్ బోయ్ లా - కాలేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు మహేష్. 43 వయసులో ఇదే రేర్ ఫీట్ అనే చెప్పాలి.

అవసరాన్ని బట్టి ఊసరవెల్లి తన రూపం మార్చుకుంటుంది. రకరకాల రంగులకు మారిపోయి షాకిస్తుంటుంది. అంతకుమించి పోతున్నాడు మహేష్. తనని కాలేజ్ కుర్రాడిగా మారిపొమ్మని వంశీ పైడిపల్లి సూచించగానే సన్నని గడ్డం - నూనూగు మీసంతో కనిపించి పెద్ద షాకిచ్చాడు. 1- నేనొక్కడినే - స్పైడర్ టైమ్ లో లుక్ తో పోలిస్తే - ఈ లుక్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఇంకా చెప్పాలంటే 20లలో టామ్ క్రూజ్ ఎలా ఉండేవాడో మహేష్ అలా కనిపిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. మహర్షి చిత్రీకరణ ప్రస్తుతం వేగంగా పూర్తవుతోంది. అలానే ఇటీవలే ఓ యాడ్ షూట్ కోసం మహేష్ కొరటాలతో కలిసి పని చేశాడు. అక్కడా ఇదే లుక్ తో షాకిచ్చాడు మహేష్. ఇక ఈ ఫోటో ప్రస్తుతం యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.