ఒరిజినల్ లుక్కే బాగుందని...

Wed Apr 19 2017 22:02:33 GMT+0530 (IST)

చాలా మంది స్టార్ హీరోలు సినిమా సినిమాకి కొత్త లుక్ తో కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తారు. కానీ కొందరు మాత్రం ప్రతీ సినిమాలోనూ సేమ్ లుక్ ని మెయింటెయిన్ చేస్తూ అలరిస్తారు. మహేష్ కూడా తన ఫిజికల్ లుక్ ని మార్చేందుకు పెద్దగా ఇష్టపడడు.

ఇప్పటివరకూ మహేష్ విభిన్నంగా కనిపించే ప్రయత్నించిన సినిమాలు కొన్నే. పోకిరి.. అతిథి.. టక్కరిదొంగ.. నిజం మూవీస్ లో కొత్తగా ట్రై చేశాడు మహేష్ బాబు. అయితే..  పోకిరి మినహాయిస్తే మిగిలినవేవీ క్లిక్ కాలేదు. ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న స్పైడర్ లో కూడా కొత్తగా కనిపించేందుకు మొదట ప్రయత్నించాడంటారు. కానీ దానికంటే తన ఒరిజినల్ లుక్కే బాగుందనే ఉద్దేశ్యంతో.. యాజిటీజ్ గానే కంటిన్యూ చేశారట.

కానీ మహేష్ బాబు తన తర్వాతి సినిమాను కొరటాలతో చేస్తుండగా.. ఆ మూవీలో ముక్యమంత్రి పాత్రలో కనిపిస్తాడనే టాక్ ఉంది. భరత్ అనే నేను అనే టైటిల్ ని డిసైడ్ చేసే అవకాశం ఉండగా.. రాజకీయ నాయకుడి గెటప్ కోసం కొత్త లుక్ ని ట్రై చేస్తున్నాడని అంటున్నారు. దీని కోసం ఇప్పటికే కొన్ని స్కెచ్ లు సిద్ధం చేయగా.. త్వరలోనే వీటిలో ఒకటి ఫైనల్ చేస్తాడట టాలీవుడ్ సూపర్ స్టార్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/