Begin typing your search above and press return to search.

అవును.. మహేష్ బయటికొచ్చాడు

By:  Tupaki Desk   |   30 July 2016 6:23 AM GMT
అవును.. మహేష్ బయటికొచ్చాడు
X
ఇదిగో అదిగో అంటూ రెండు నెలలుగా నెట్టుకొస్తున్నారు మహేష్ బాబు-మురుగదాస్ సినిమా విషయంలో. మొన్నామధ్య జులై 29న షూటింగ్ ఆరంభం అని అనౌన్స్ మెంట్ వచ్చినా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలా ఎన్ని డేట్లు దాటిపోలేదు అనుకున్నారు. ఐతే శుక్రవారం నిజంగానే మహేష్-మురగ సినిమా మొదలైపోయింది. హైదరాబాద్ లో నిన్న సింపుల్ గా జరిగిన ముహూర్త కార్యక్రమంలో డైరెక్టర్ మురుగదాస్ తో పాటు నిర్మాతలు ఎన్వీ ప్రసాద్.. ఠాగూర్ మధు కూడా పాల్గొన్నారు. తన సినిమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనే అలవాటు లేని మహేష్.. ఈ వేడుకకు కూడా దూరంగా ఉన్నాడు.

ఇక శనివారం నుంచి అన్నపూర్ణ స్టూడియోలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కాగా.. మహేష్ హాజరైనట్లు సమాచారం. ఆగస్టు 13 వరకు ఇక్కడే తొలి షెడ్యూల్ జరుగుతుంది. మహేష్ ఈ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్న నేపథ్యంలో తన ఫొటోలేవీ బయటికి రాకుండా చూడాలని భావిస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ లుక్ పరిచయం చేసే అవకాశాలున్నాయి. తొలి షెడ్యూల్ కాగానే.. ముంబయిలో రెండో షెడ్యూల్ మొదలవుతుంది. పుణె.. గుజరాత్.. చెన్నై.. ఇలా రకరకాల ప్రాంతాల్లో షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించే ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం.