Begin typing your search above and press return to search.

న్యూయార్క్‌ లో అలా మొద‌లు..

By:  Tupaki Desk   |   19 Oct 2018 5:50 AM GMT
న్యూయార్క్‌ లో అలా మొద‌లు..
X
సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌ లో `మ‌హ‌ర్షి` చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అశ్వ‌నిద‌త్‌ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌హేష్ పూర్తిగా గెట‌ప్ మార్చి కాలేజ్ విద్యార్థిగా మారిపోయారు. ఈ మూవీలో త‌న‌ని తాను కొత్త‌గా ఎలివేట్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అమెరికాలో కీల‌క షెడ్యూల్ కోసం టీమ్ వెయిటింగ్.

నేడో రేపో అంటూ ఇటీవ‌ల చాలా స‌హ‌నంతో వేచి చూశార‌ట‌. అయితే అమెరికాలో ట్రంప్ విధానాల వ‌ల్ల‌నో ఎందుక‌నో వీసాలు రావ‌డం అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు వీసాలు వ‌చ్చాయిట‌. దీంతో కొత్త షెడ్యూల్‌ ని న్యూయార్క్‌ లో ప్రారంభించేశారు. మహేష్ స‌హా కొంద‌రు అమెరిక‌న్ ఆర్టిస్టులపై కొన్ని ఘ‌ట్టాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎలాంటి గ్యాప్ లేకుండా 20 రోజుల పాటు ఏక‌ధాటిగా చిత్రీక‌ర‌ణ సాగిస్తార‌ని తెలిసింది. ఈ షెడ్యూల్‌ లో అల్ల‌రి న‌రేష్ - క‌థానాయిక పూజా హెగ్డే జాయిన్ అవుతున్నార‌ట‌.

మొత్తానికి ఈ షెడ్యూల్ పూర్త‌యినా, మ‌రోసారి అమెరికాకు వెళ్లాల్సిన సంద‌ర్భం ఉంటుందిట‌. అందుకు ఇంకా తేదీని ఫిక్స్ చేయ‌లేదు. ప్ర‌తిసారీ వీసా స‌మ‌స్య లేకుండా సులువుగా ప‌న‌వుతుంద‌నే భావించాలి. మ‌హేష్ ప్ర‌స్తుతం న్యూయార్క్ షూట్‌ లో ఉన్న ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. వీటిలో మ‌హేష్‌ తో పాటు గౌత‌మ్ కూడా క‌నిపించడంతో ఫ్యాన్స్‌ లో ఒక‌టే ఎగ్జ‌యిట్‌ మెంట్. వ‌చ్చే స‌మ్మ‌ర్ కి ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. రాక్‌ స్టార్ దేవీ శ్రీ బాణీలు రెడీ చేస్తున్నారు.