Begin typing your search above and press return to search.

మహర్షి ఇప్పుడు అలా చేస్తున్నాడు..!

By:  Tupaki Desk   |   16 Nov 2018 7:59 AM GMT
మహర్షి ఇప్పుడు అలా చేస్తున్నాడు..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ల్యాండ్ మార్క్ సినిమా 'మహర్షి' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈమధ్యే అమెరికా లో ఒక లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'మహర్షి' టీమ్ హైదరాబాద్ కు తిరిగివచ్చింది. వచ్చిన తర్వాత బ్రేక్ ఏమీ తీసుకోకుండా పనిలో పడిపోయారట. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది.

దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాకు కీలకమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ ను ప్రస్తుతం మహేష్.. ఇతర ముఖ్యమైన ఆర్టిస్టులపై చిత్రీకరిస్తున్నాడని సమాచారం. షెడ్యూల్ కి మరో షెడ్యూల్ కి మధ్యలో పెద్దగా గ్యాప్ లేకుండా వంశీ పైడిపల్లి చక్కటి ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడట. ఈ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకో అమెరికా షెడ్యూల్ ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు రొటీన్ కి భిన్నంగా పలు గెటప్స్ లో కనిపిస్తాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాలేజ్ స్టూడెంట్ లుక్.. సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవొ లుక్ లు బయటకు వచ్చాయి. ఇక మన సూపర్ స్టార్ ఇతర లుక్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. దిల్ రాజు - అశ్విని దత్ - పీవీపీ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.