మహర్షి కూడా శ్రీమంతుడే..!

Tue Dec 18 2018 21:59:25 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ రెండు మూడు షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాలేజ్ స్టూడెంట్ గా.. ఒక కార్పోరేట్ కంపెనీకి సీఈవో గా.. ఒక గ్రామంలో రైతుల సమస్యలపై పోరాటం చేసే వ్యక్తిగా కనిపిస్తాడని అంటున్నారు.ఈ సినిమా కథాంశం.. కథాగమనం వేరైనప్పటికీ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమా  'శ్రీమంతుడు' తో ఫ్లేవర్ ఒక విషయంలో కనిపిస్తుందట.  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీమతుడు' సినిమాలో మహేష్ ఒక బిలియనీర్ కు వారసుడు.  ఎన్నో వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. విలన్లను అడ్డుకుని వలసలు వెళ్ళేవారిని ఆపి గ్రామాన్ని వల్లకాడు కాకుండా అడ్డుకుంటాడు. ఇక 'మహర్షి' విషయానికి వస్తే మహేష్ ప్రపంచంలో ఉండే టాప్ 5 బిలియనీర్స్ లో ఒకరిగా ఉంటాడట. కానీ తన స్నేహితుడి కోసం తెలుగు రాష్ట్రంలోని ఒక గ్రామానికి వచ్చి రైతు సమస్యలు తీర్చేందుకు పోరాటం చేస్తాడట.

అంటే రెండు సినిమాల్లో అల్టిమేట్ గా గ్రామాల్లోని సమస్యలు సాల్వ్ చేయడమే మెయిన్ థీమ్. రెండూ సినిమాల్లో మహేష్ ఒక రిచ్ పర్సన్.  ఇవి జస్ట్ ఒకటి రెండు పోలికలు మాత్రమే. అయినా ఇలాంటి స్టొరీలు మహేష్ కు చక్కగా సూట్ అవుతాయి. ఎందుకంటే మహేష్ లుక్స్ నిజంగా రాజకుమారుడు లాగానే ఉంటాయి. 'శ్రీమంతుడు' సినిమాతో మ్యాజిక్ చేసినట్టు 'మహర్షి' తో కూడా మ్యాజిక్ చేస్తాడో లేదో వేచి చూడాలి.