Begin typing your search above and press return to search.

'మ‌హ‌ర్షి' ఎంత షేర్ వ‌సూలు చేయాలి?

By:  Tupaki Desk   |   14 April 2019 4:54 AM GMT
మ‌హ‌ర్షి ఎంత షేర్ వ‌సూలు చేయాలి?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బిజినెస్ రేంజు ఎంత‌? అత‌డి పేరుతో ఒక సినిమాకి ఎంత బిజినెస్ చేయొచ్చు? అన్న‌ది ప‌రిశీలిస్తే .. ప్రీ రిలీజ్ బిజినెస్‌ రేంజ్ మినిమం 90-150 కోట్లు అని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ న‌టిస్తున్న 25వ సినిమా `మ‌హ‌ర్షి` బిజినెస్ లెక్క‌లు ప‌రిశీలిస్తే ఈ సంగ‌తి స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. `మ‌హ‌ర్షి` చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో 91.50 కోట్ల బిజినెస్ చేసింది. శాటిలైట్.. డ‌బ్బింగ్ రైట్స్.. డిజిట‌ల్ రిలీజ్.. ఆడియో హ‌క్కులు ఇలా అన్నిటినీ క‌లుపుకుని మ‌రో 47 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసుకుంది. అంటే ఓవ‌రాల్ గా 141.50 కోట్ల బిజినెస్ సాగించింది ఈ చిత్రం.

మ‌హేష్ గ‌త మూడు సినిమాల థియేట్రిక‌ల్‌ బిజినెస్ లెక్క‌లు ప‌రిశీలిస్తే మ‌హ‌ర్షి మూడో స్థానంలో ఉంది. 99.20 కోట్ల బిజినెస్ తో `భ‌ర‌త్ అనే నేను` నంబ‌ర్ 1 స్థానంలో నిల‌వ‌గా - ఆ త‌ర్వాత 97.10 కోట్ల బిజినెస్ తో స్పైడ‌ర్ రెండో స్థానంలో నిలిచింది. 91.50 కోట్ల బిజినెస్ తో మ‌హ‌ర్షి మూడో స్థానానికి ప‌రిమిత‌మైంది.

`మ‌హ‌ర్షి` చిత్రాన్ని మెజారిటీ పార్ట్ చిత్ర‌నిర్మాత‌లే రిలీజ్ చేసుకుంటున్నారు. నైజాం - యుఏ ప‌రిధిలో దిల్ రాజు స్వ‌యంగా రిలీజ్ చేస్తుండ‌గా... కృష్ణ‌-గుంటూరులో అశ్వ‌ని ద‌త్ స్వ‌యంగా రిలీజ్ చేస్తున్నారు. సీడెడ్-నెల్లూరు- తూగో-ప‌.గో జిల్లాల్లో ఎన్‌.ఆర్.ఏ బేసిస్ లో అమ్మ‌కాలు సాగించారు. ఏరియా వైజ్ బిజినెస్ ప‌రిశీలిస్తే.. నైజాం-22 కోట్లు - సీడెడ్ -12కోట్లు (ఎన్‌.ఆర్.ఏ) - ఆంధ్రా -38 కోట్లు బిజినెస్ సాగింది. ఏపీ- తెలంగాణ క‌లుపుకుని 72 కోట్ల బిజినెస్ పూర్త‌యింది. క‌ర్నాట‌క‌-త‌మిళ‌నాడు- ఉత్త‌ర భార‌త‌దేశం క‌లుపుకుని 10కోట్లు - ఓవ‌ర్సీస్ -12.50 కోట్లు బిజినెస్ పూర్త‌యింది. అంటే మ‌హ‌ర్షి చిత్రం 100 కోట్ల షేర్ వ‌సూలు చేస్తేనే పంపిణీదారు సేఫ్ అన్న‌మాట‌!!