Begin typing your search above and press return to search.

అచ్చం డాడ్ లానే ఉన్నాడు మ‌మ్మీ!

By:  Tupaki Desk   |   25 March 2019 7:48 AM GMT
అచ్చం డాడ్ లానే ఉన్నాడు మ‌మ్మీ!
X
ఏఎంబీ మాల్‌ లో అంద‌గాడు సుంద‌రూడు కొలువు దీరాడు. మ‌గువ‌ల గుండెల్లో స‌మ్మోహ‌నాస్త్రం సంధించాడు. అచ్చం మ‌న సూప‌ర్ స్టార్ లానే ఉన్నాడే! అంటూ ఆ ప్రాంగ‌ణంలో ఒక‌టే గుస‌గుస‌లు వినిపించాయి. ఏఎంబీ ఇంద్ర భ‌వ‌నంలో నేటి ఉద‌యం 10 గం.ల‌కు మ‌హేష్ మైన‌పు విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠించారు. ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు సింగ‌పూర్ నుంచి టుస్సాడ్స్ ప్ర‌తినిధులు హైద‌రాబాద్ - ఏఎంబీలో అడుగుపెట్టారు. అంత‌ర్జాతీయ మీడియాని వెంట తీసుకొచ్చారు. సౌత్ లో ఇలాంటి ఫీట్ ఇదే తొలిసారి. ఇది ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీకే అరుదైన గౌర‌వంగా భావించ‌వ‌చ్చు.

ఇక మ‌హేష్ మైన‌పు విగ్ర‌హాన్ని వీక్షించేందుకు ఏఎంబీ మాల్ కి విచ్చేసిన సితార‌, గౌత‌మ్ అయితే ఎంతో ఆశ్చ‌ర్య‌పోయారు. షాక్ తిని అలా నిమిషాలు.. గంట‌ల సేపు క‌ళ్లార్ప‌కుండా అక్క‌డే నిల‌బ‌డి చూశారు. 'వామ్మో డాడ్ లా ఉన్నాడే!' అంటూ ఆశ్చ‌ర్య‌పోయిన సితార ఆ విగ్ర‌హం వైపు, డాడ్ వైపు చూస్తూ అలానే ఉండిపోయింది. ఏఎంబీలో క్యూట్ సితార అల్ల‌రి వేషాలు అంద‌రినీ మైమ‌రిపించాయి. మ‌హేష్ ఈ ఈవెంట్ కి సింపుల్ గా పింక్ క‌ల‌ర్ ష‌ర్ట్- కాంబినేష‌న్ బ్లాక్ ఫ్యాంట్ ధ‌రించి ఫార్మ‌ల్ లుక్ లో విచ్చేశారు. అలాగే న‌మ్ర‌త పూర్తిగా బ్లాక్ & బ్లాక్ లో అల్ట్రా మోడ్ర‌న్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. మాష్ట‌ర్ గౌత‌మ్ సింపుల్ గా టీష‌ర్ట్ - జీన్స్ లో ఆక‌ట్టుకున్నాడు.

ఇక రెగ్యుల‌ర్ గా మ‌నం చూసే మ‌హేష్‌ ని మించిన యంగ్ లుక్ ఆ మైన‌పు విగ్ర‌హంలో క‌నిపించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు వ‌చ్చింది. టైటానిక్ షిప్‌ లో డికాప్రియో అంత స్మార్ట్ గా క‌నిపించాడు మహేష్‌. బ్లాక్ సూట్ ధ‌రించి ఆ కుడి చేతిని గ‌డ్డానికి ఆన్చిన వైనం మైమ‌రిపించింది. అంత స్మార్ట్ గా ఆ విగ్ర‌హాన్ని తీర్చిదిద్దిన టుస్సాడ్స్ శిల్పుల ప‌నితనంపై పొగడ్త‌ల వ‌ర్షం కురిసింది. మీడియా నుంచి టుస్సాడ్స్ నిర్వాహ‌కులు ప్ర‌శంస‌లు అందుకున్నారు.