ఏజ్ తగ్గించుకునే సీక్రెట్ ఏంటి మహేష్

Sun Mar 19 2017 14:11:16 GMT+0530 (IST)

అదేంటో.. అందరికీ ఏటికేడాది వయసు పెరుగుతూ ఉంటుంది. సంవత్సరం మారేకొద్దీ కాసింత వయసు మీరినట్లుగా కనిపిస్తూ ఉంటారు. 40 దాటడం అంటే.. ఆ తేడా స్పష్టంగా ఫేస్ లో కనిపించేస్తూ ఉంటుంది. కానీ మహేష్ బాబు ఒక్కడికీ మాత్రం ఈ విషయంలో రివర్స్ లో జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. మహేష్ కి యాడ్స్ కొత్తేమీ కాదు కానీ.. ఈ యాడ్ లో సూపర్ స్టార్ మరీ సూపర్బ్ గా ఉన్నాడు. నార్త్ ఇండియన్ ట్రెడిషనల్ వేర్ లో మహేష్ బాబు భలే మెరిసిపోతున్నాడు. రీసెంట్ గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ యాడ్ చేసిన మహేష్.. ఆ తర్వాత వెంటనే మరో యాడ్ షూటింగ్ చేసేశాడు. డిజైనర్ డ్రస్సులో మహేష్ లుక్ మరీ సూపర్బ్ గా ఉంది. ముఖ్యంగా కొత్త హెయిర్ స్టైల్ తో.. మహేష్ మరీ మెరిసిపోతున్నాడు.

41 సంవత్సరాలు నిండినా.. సూపర్ స్టార్ ఇంత అందంగా కనిపించడానికి కారణం ఏంటనే విషయం మాత్రం ఇంకా ఎవరికీ చెప్పలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. మురుగదాస్ తో చేస్తున్న మూవీని ఏప్రిల్ నెల చివరికల్లా పూర్తి చేసేయనున్న మహేష్.. ఆ వెంటనే మే నెల మొదటివారంలో కొరటాల శివతో 'భరత్ అనే నేను' అంటూ కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/