సింగల్ టేక్ లో భరత్ నాన్ స్టాప్

Sun Apr 15 2018 17:15:55 GMT+0530 (IST)

భరత్ అనే నేను విడుదల దగ్గర పడే కొద్ది అభిమానుల్లోనే కాదు యూనిట్ లో కూడా టెన్షన్ పెరుగుతోంది. రిజల్ట్ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ ప్రేక్షకుల స్పందన ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఊహకు అందటం లేదు. దీనికి సంబంధించిన ప్రతి చిన్నా పెద్ద అప్ డేట్ ఫాన్స్ కి హుషారుతో పాటు అంచనాలు కూడా అమాంతం పెంచేస్తోంది. దానికి తోడు టాలీవుడ్ లో స్టార్ హీరో పూర్తిగా స్థాయి ముఖ్యమంత్రిగా నటించిన సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది కాబట్టి అది కూడా అడ్వాంటేజ్ అవుతోంది. రానా లీడర్ చేసాడు కాని అది అతని డెబ్యు మూవీ. ఇక భరత్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా కనక ఇందులో శాసనసభకు సంబంధించి చాలా కీలకమైన సన్నివేశాలు ఉన్నాయట. ముఖ్యంగా ఏకబికిన 15 నిమిషాల పాటు వచ్చే ఒక ఎపిసోడ్ సినిమా మొత్తానికి హై లైట్ గా ఉండబోతోంది అని టాక్.విశేషం ఏంటంటే ఇది సింగల్ టేక్ లోనే గ్యాప్ లేకుండా కొరటాల శివ షూట్ చేయటం. నిజానికి పెద్ద సినిమా చేసేటప్పుడు ఇంత లెంగ్త్ ఉన్న సీన్ ని సింగల్ టేక్ లో చేయటం దాదాపు అసాధ్యం. కొరటాల శివ దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని మహేష్ బాబు ఇతర నటీనటులు టెక్నీషియన్స్  సహకారంతో పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మైండ్ బ్లోయింగ్ తరహాలో వచ్చిందని సమాచారం. అందరు ఆర్టిస్టులు చుట్టూ కెమెరాలు అందులోనూ మహేష్ బాబు లాంటి స్టేచర్ ఉన్న హీరోతో ఇది చేయటం అంటే సాహసమే. ట్రైలర్ లో వచ్చే ఒక సీన్ లో మహేష్ బాబు సభకు సెలవు చెప్పి ఇంటికి వెళ్ళాలి అనే చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అది ఈ ఎపిసోడ్ తర్వాత వచ్చేదే అని వినికిడి. దీంతో ఇప్పటికే ఆకాశాన్ని దాటిన అభిమానుల అంచనాలు ఇప్పుడు దాన్ని కూడా దాటేసాయి. బెనిఫిట్ షోల పరంగా ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త రికార్డులు సెట్ చేస్తాడని భరత్ మీద ట్రేడ్ భారీ ఆశలు పెట్టుకుంది.