Begin typing your search above and press return to search.

రెండోసారి సుక్కూ ఏం చేస్తాడో!?

By:  Tupaki Desk   |   23 April 2018 11:30 PM GMT
రెండోసారి సుక్కూ ఏం చేస్తాడో!?
X
రెండు డిజాస్ట‌ర్ల తర్వాత ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాతో బంప‌ర్ హిట్ ద‌క్క‌డంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు మ‌హేష్ బాబు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డు లెవెల్లో వ‌సూళ్లు సాధిస్తోంది. ఇప్పుడు త‌న 25వ సినిమా కోసం వంశీ పైడిప‌ల్లితో చేతులు క‌లిపిన మ‌హేష్‌... 26వ సినిమా లెక్క‌ల మాస్టారుతోనే అని క‌న్ఫార్మ్ చేసేశాడు.

అయితే మ‌హేష్ బాబు విష‌యంలో ఓ సెంటిమెంట్ తెలిసి తెగ మ‌థ‌న‌ప‌డుతున్నార‌ట సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్‌. మ‌హేష్ బాబు ఏ ద‌ర్శ‌కుడితో రెండో సినిమా తీసినా అది డిజాస్ట‌ర్ అయ్యి కూర్చుంది. ‘ఒక్క‌డు’ సినిమాతో మ‌హేష్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన గుణ‌శేఖ‌ర్ తో రెండో సినిమాగా ‘అర్జున్‌’ చేశాడు. అది యావ‌రేజ్ గా ఆడింది. ఆ త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన‌ మూడో సినిమా ‘సైనికుడు’ ఫ‌లితం తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన తొలి సినిమా ‘అత‌డు’ మంచి క్లాసిక‌ల్ హిట్‌. ఆ త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన ‘ఖ‌లేజా’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ్లాప‌య్యింది. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిన ‘పోకిరి’ ఇండ‌స్ట్రీ హిట్టు సాధించి... మ‌హేష్ ను స్టార్ లీగ్ లోకి తెచ్చింది. ఆ త‌ర్వాత మ‌హేష్‌- పూరీల కాంబోలో ‘బిజినెస్ మాన్‌’ వ‌చ్చింది. యావ‌రేజ్ గా ఆడింది. ఫ్లాపుల‌తో స‌త‌మ‌వుతున్న స‌మ‌యంలో ‘దూకుడు’ సినిమాతో మ‌రిచిపోలేని విజ‌యం అందించిన శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రెండో సారి చేసిన ‘ఆగ‌డు’ అట్ట‌ర్ ఫ్లాప‌య్యింది. ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల కూడా ‘బ్ర‌హ్మోత్స‌వం’ అంటూ భారీ డిజాస్ట‌ర్ చేతిలో పెట్టాడు.

ఇలా చూసుకుంటే ఇప్ప‌టిదాకా మ‌హేష్ రెండోసారి న‌టించిన ఏ ద‌ర్శ‌కుడూ హిట్టు సినిమా ఇవ్వ‌లేదు. ఒక్క కొరిటాల శివ త‌ప్ప‌! కొరిటాల మాత్ర‌మే ‘శ్రీ‌మంతుడు’- ‘భ‌ర‌త్ అనే నేను’ రెండూ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లే ఇచ్చాడు. ఇదే న‌మ్మ‌కంతో సుకుమార్ కి మ‌రో ఛాన్స్ ఇవ్వాల‌ని మ‌హేష్ బ్లైండ్ గా ఫిక్స్ అయ్యిన‌ట్టు స‌మాచారం. అదీ గాక సుక్కూ- మ‌హేష్ కాంబిలో వ‌చ్చిన ‘వ‌న్ - నేనొక్క‌డినే’ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రిగా ఆడ‌క‌పోయినా మంచి ప్ర‌యోగంగా ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అదీ కాక ‘నాన్న‌కు ప్రేమ‌తో’-‘రంగ‌స్థ‌లం’ వంటి వ‌రుస హిట్ల‌తో మంచి జోరుమీదున్నాడు సుకుమార్‌. అందుకే లెక్క‌ల మాస్టారితో మ‌రో ప్ర‌యోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈ టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్‌. చూడాలి సుక్కూ ఏం చేస్తాడో... బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు బొమ్మ తీస్తాడో... మ‌ళ్లీ అర్థంకాని లెక్క‌ల సినిమా తీసి దెబ్బేస్తాడో!