Begin typing your search above and press return to search.

స్పైడర్ టీజర్.. మోసం చేశారట..

By:  Tupaki Desk   |   26 Sep 2017 12:21 PM GMT
స్పైడర్ టీజర్.. మోసం చేశారట..
X
ఓ సినిమాకి సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చిందంటే.. అది కూడా మహేష్ బాబు లాంటి మూవీ విషయంలో అంటే కచ్చితంగా దానిపై అంచనాలు పెరిగిపోతాయి. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ విషయానికి వస్తే.. పేరు దగ్గర నుంచి అన్ని అంశాల్లోనూ ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఓ టీజర్ ను రిలీజ్ చేసింది యూనిట్.

ఇందులో మహేష్ తన పని తాను చేసుకుంటూ ఉంటే.. ఓ రోబోటిక్ స్పైడర్ మహేష్ మీదకు ఎక్కుతుంది. చివరకు సూపర్ స్టార్ ఉష్.. అంటూ దాన్ని సైలెంట్ చేయడంతో టీజర్ ముగుస్తుంది. ఇది చూసిన వారికి ఎవరికైనా.. మహేష్ నటిస్తున్న స్పైడర్ మూవీ సైంటిఫిక్ చిత్రం అని.. మూవీలో ఆ రోబోటిక్ స్పైడర్ కి ప్రాధాన్యత ఉంటుందని.. కథంతా దాని చుట్టూనే తిరుగుతుందని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. ఇప్పుడు మహేష్ బాబు ఓ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. అశలు స్పైడర్ మూవీలో అలాంటి రోబోటిక్ స్పైడర్ ఉండదని తేల్చేశాడు.

టీజర్ ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే ఉద్దేశ్యంతోనే అలాంటి స్పైడర్ ను క్రియేట్ చేశాం తప్ప.. సినిమాలో అలాంటి స్పైడర్ కనిపించబోదని తేల్చేశాడు మహేష్. ఓ విధంగా ఇది జనాలను తప్పుదోవ పట్టించడమే అయినా.. థియేటర్లకు వచ్చే జనాలు.. రోబోటిక్ స్పైడర్ కోసం ఎదురుచూడ్డం ఇష్టం లేకే ఈ విషయాన్ని ముందే చెప్పేస్తున్నట్లు తెలిపాడు. అయితే.. జనాలు ఊహించని.. ఊహించలేని ఎన్నో థ్రిల్స్ మూవీలో ఉంటాయని మాత్రం చెప్పాడు సూపర్ స్టార్.