Begin typing your search above and press return to search.

ఆయన్ని మర్చిపోతే ఎలా మహేష్ ?

By:  Tupaki Desk   |   13 May 2019 4:16 AM GMT
ఆయన్ని మర్చిపోతే ఎలా మహేష్ ?
X
నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో మహర్షి గురించి మహేష్ బాబు మాట్లాడింది కొద్దిసేపే అయినా అందులో కొన్ని పాయింట్స్ మాత్రం కొత్త చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ గురించి చెప్పిన తీరు అతనంటే ప్రాణమని తనలాగా ఇంకే మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలను కంపోజ్ చేయలేరని ఓ రేంజ్ లో పొగడటం అందరిని షాక్ కి గురి చేసింది. బాగా కంపోజ్ చేశాడు మరో హిట్ ఆల్బమ్ ఇచ్చాడు అంటే సరిపోయేది. ఏ ఇబ్బంది లేదు.

దేవి అంటే ప్రాణం తాను లేకుండా నేను లేను అనే తరహాలో కొంత అతిశయోక్తిగా పొగిడేశాడు. నిజానికి రెండు పాటలకు తప్ప దేవి దీనికి చాలా యావరేజ్ ఆల్బమ్ ఇచ్చాడు. ప్రీ రిలీజ్ కు ముందు చాలా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రాలింగ్ కూడా జరిగింది. రిలీజయ్యాక సినిమా బాగున్నా డ్యూయెట్స్ కి ప్రేక్షకులు పెదవి విరిచారు.ఈ మాత్రం దానికి ఇన్నేసి ప్రశంసలా అనే కామెంట్స్ లేకపోలేదు

నిజానికి దేవి కన్నా గొప్పగా అద్భుతంగా గతంలో మణిశర్మ మహేష్ కు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇచ్చారు. ఒక్కడు-పోకిరి-మురారి సినిమాలను మణి పాటలు బీజీఎమ్ లేకుండా ఊహించుకుంటే ఓ మెట్టు కిందకు దిగిపోతాయి. అంతదాకా ఎందుకు డిజాస్టర్స్ గా చెప్పుకునే టక్కరి దొంగ-బాబీ-అతిథి మ్యూజికల్ గా హిట్సే. ఇవన్నీ ఇచ్చింది మణిశర్మనే. ఒప్పుకోవాల్సిన విషయమే. దేవి ఇంత ఘనతను సాధించలేకపోయాడు. మహేష్ ప్రస్థానంలో మణిశర్మ పాత్ర చాలా కీలకం. అలాంటిది తన కెరీర్ లో దేవిని మించిన సంగీత దర్శకుడు లేడు అనే తరహాలో చెప్పడం మెలోడీ బ్రహ్మ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిందనే చెప్పాలి