Begin typing your search above and press return to search.

కెరీర్ బెస్ట్ సీన్ అదే : మహేష్

By:  Tupaki Desk   |   23 April 2018 6:25 AM GMT
కెరీర్ బెస్ట్ సీన్ అదే : మహేష్
X
మహేష్ బాబు సినిమాలు అన్నింటిలోకి బెస్ట్ సీన్ ఏది అని ఎవరినైనా అడిగితే అందరు చెప్పేది ఒక్కడులో కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకాష్ రాజ్ ని కొట్టడం. కాని ప్రిన్స్ మాత్రం ఇప్పటి నుంచి తనకు భరత్ అనే నేనులో ప్రెస్ మీట్ ఎపిసోడ్ లో మీడియాను ప్రశ్నించేదే ఫేవరేట్ అంటున్నాడు. దానికి కారణం కూడా లేకపోలేదు. గుండె లోతుల్లో నుంచి ఆ సంభాషణలు తన నోటి నుంచి వచ్చాయని ఇప్పుడు దానికి వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. మీసం మీద పెద్ద ఆసక్తి లేదన్న మహేష్ కొరటాల శివ కోరిక మేరకే సాంగ్ లా అలా కనిపించానని ఇప్పుడు అందరు నాన్న గారే కనిపిస్తున్నారు అని చెప్పడం చూస్తుంటే మాటలు రావడం లేదని అన్నాడు. నిజానికి ప్రెస్ మీట్ సీన్ కు థియేటర్లో కూడా మహేష్ చెప్పిన స్పందనే ఉంది. చాలా ఎమోషనల్ గా మహేష్ చూపించిన పెర్ఫార్మన్స్ ఒన్స్ మోర్ అనేలా ఉంది.

దుర్గామహల్ ఫైట్ గురించి కూడా మహేష్ ఇదే విధంగా స్పందించాడు. శ్రీమంతుడు సినిమాలో మామిడి తోట ఫైట్ ను మించి మరొకటి మా కాంబోలో ఫాన్స్ ఎక్స్ పెక్ట్ చేసారని ఇప్పుడు థియేటర్ ఫైట్ గురించి ఫాన్స్ మాట్లాడుకుంటూ ఉంటే గర్వంగా ఉందని మహేష్ పొంగిపోయాడు. ట్రాఫిక్ ఎప్పుడైనా ఇబ్బంది తలెత్తినప్పుడు భరత్ అనే నేనులోని సీన్స్ గుర్తు చేసుకుంటున్నారట అభిమానులు. మొత్తానికి ఆచరణ సాధ్యం కాకపోయినా కనీసం అలోచన చేసేందుకైనా భరత్ అనే నేను అవకాశం కల్పించడం మెచ్చదగిందే. ఓవర్సీస్ లో ప్రభంజనం సృష్టిస్తున్న భరత్ అనే నేను తెలుగు రాష్ట్రాల్లో కూడా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. హింది డబ్బింగ్ వెర్షన్ కన్ఫర్మ్ చేస్తూ దర్శకుడు కొరటాల శివ ప్రకటన కూడా చేసిన నేపధ్యంలో భరత్ బాలీవుడ్ లో కూడా అడుగు పెడుతున్నాడు.