బొద్దుగా ఉన్న భరత్ ను చూస్తారా!

Wed May 16 2018 12:15:04 GMT+0530 (IST)

భరత్ అనే నేను విజయానందంలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ త్వరలోనే వంశీ పైడిపల్లి షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. అభిమానులు కూడా రెండేళ్ళ తర్వాత వచ్చిన ఇండస్ట్రీ హిట్ కావడంతో వాళ్ళ ఆనందం కూడా మాటల్లో చెప్పలేనట్టుగా ఉంది. ఇదిలా ఉంటె సోషల్ మీడియాలో మహేష్ బాబు పాత ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. అందులో ఏముంది అనుకుంటున్నారా. స్లిమ్ గా మ్యాన్లీనెస్ కి రోల్ మోడల్ గా భరత్ అనే నేను లో చూసిన మహేష్ కి ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న మహేష్ కి చాలా తేడా ఉండటమే. అప్పుడెప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు మానేసాక ఒక  వేడుకలో అక్కయ్య మంజులతో మాట్లాడుతున్నప్పుడు క్లిక్ మనిపించిన ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో మహేష్ చాలా అమాయకంగా బొద్దుగా ఎంత ముద్దొస్తున్నాడో చెప్పాలంటే మాటలు కష్టమే. పైగా లుక్స్ ని గమనిస్తే పోత పోసిన అమాయకత్వం మహేష్ ఫేస్ లో బాగా కనిపిస్తుంది.మహేష్ మొదటి సినిమా రాజకుమారుడు కంటే ముందే తీసిన ఫోటో ఇది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్న కృష్ణ గారితో కలిసి ఆయుధం-ముగ్గురు కొడుకులు-అన్న తమ్ముడు-కొడుకు దిద్దిన కాపురం-గూడచారి 117 లాంటి సినిమాల్లో నటించిన మహేష్ సోలోగా చేసిన మొదటి సినిమా బాలచంద్రుడు. అందులో కూడా మాస్టర్ మహేష్ బాబుగానే కనిపిస్తాడు. దాని తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న మహేష్ గ్యాప్ తీసుకుని శిక్షణ తీసుకుని రాజకుమారుడు టైంకి స్లిమ్ లుక్ లోకి మారిపోయి ఇప్పుడు మనం చూస్తున్న మేజిక్ ఫిజిక్ లోకి వచ్చేసాడు. తన ఫిట్నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే మహేష్ ఏనాడూ అవుట్ అఫ్ కంట్రోల్ వెళ్ళలేదు. అందుకే మహేష్ పెళ్లి అనౌన్స్ చేసినప్పుడు ఎందరో అమ్మాయిలు గుక్కపట్టి ఏడ్చారని అప్పట్లోనే కథనాలు వచ్చాయి.మహేష్ మీద అమ్మాయిలలో ఎంత క్రేజ్ ఉంటుంది అనే పాయింట్ మీద దర్శకుడు ఇంద్రగంటి ఏకంగా అష్టాచెమ్మ అనే సినిమా తీస్తే అది కూడా సూపర్ హిట్ అయ్యింది. సో స్వీట్ మెమరీ లాంటి పైన ఫోటో చూస్తూనే అతను మహేష్ తమ్ముడు అంటే కొత్తవాళ్ళు నమ్మేలాగా ఉంది కదూ.