Begin typing your search above and press return to search.

నాని కర్చీఫ్.. మరి మహేష్ మాటేంటి?

By:  Tupaki Desk   |   5 Sep 2015 9:49 AM GMT
నాని కర్చీఫ్.. మరి మహేష్ మాటేంటి?
X
అది బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరుగుతున్న ఇంటర్వ్యూ. అన్నీ బాహుబలి గురించి ప్రశ్నలే అయితే బోర్ కొట్టేస్తుందని.. ఏదో మాట వరసకు ఇంతకీ మహేష్ తో సినిమా ఎప్పుడు అని అడిగాడు రాజమౌళిని. జక్కన్న ఏదో మాట చెప్పి తప్పించుకోకుండా.. చేస్తున్నాగా, బాహుబలి-2 తర్వాత ఉంటుంది, మహేష్ తో ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది అని బదులిచ్చాడు. ఇక అంతే సంగతులు. అదో పెద్ద హాట్ న్యూస్ అయిపోయింది. రెండు నెలలుగా రాజమౌళి-మహేష్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఇద్దరూ ఎలాంటి కథ ఎంచుకుంటారు? బడ్జెట్ ఎంతుంటుంది? నిర్మాత ఎవరు? రిలీజ్ ఎప్పుడు? అంటూ సవాలక్ష సందేహాలతో బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు.

ఐతే ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటుండగానే సడెన్ గా నాని లైన్లోకి వచ్చేశాడు. బాహుబలి-2 తర్వాత రాజమౌళితో కలిసి ఈగ-2 చేయబోతున్నట్లు సంకేతాలిచ్చాడు. ఇదేదో సరదాగా అన్న మాటలా కూడా అనిపించలేదు. నాని చాలా పక్కాగా చెప్పాడు. ఈ మాట విన్న మహేష్ అభిమానులు గందరగోళంలో పడిపోయారు. నానితో ఈగ-2 చేస్తే మరి మా మహేష్ తో సినిమా ఎప్పుడు చేస్తారంటూ రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మహేష్ దగ్గర రాజమౌళి సినిమా సంగతి ప్రస్తావించినపుడు కూడా క్లియర్ గా సమాధానం ఇవ్వట్లేదు. చేయాలి, చూడాలి అంటున్నాడు. అతడికి చాలా కమిట్మెంట్లున్నాయి. ఏది ముందో, ఏది వెనకో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి టాలీవుడ్ లో అత్యంత ఆసక్తి రేపే కాంబినేషన్ విషయంలో గందరగోళం చాలానే ఉంది.