నమ్రత రెండో భర్త ఎవరై ఉంటారు?

Mon Mar 25 2019 21:00:01 GMT+0530 (IST)

హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో మహేష్ మైనపు విగ్రహం చూశాక .. ఏ పడతి అయినా అలాంటి భర్త కావాలని కోరుకోవడం సహజం. మహేష్ ని వలచి మోహించిన అమ్మాయిలంతా నమ్రతను చూసి కుళ్లుకుంటారనడంలో సందేహమే లేదు. అయితే నమ్రత ఇప్పుడు ఊహించని విధంగా ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. ఆయన నా రెండో భర్త! అని కామెంట్ చేయడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది.ఇంతకీ ఆయనెవరు? అంటూ మహేష్ అభిమానుల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగింది. అయితే మ్యాడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు అభిమానుల సమక్షంలో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మహేష్ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం  చేశారు. ఆ మైనపు విగ్రహాన్ని చూశాక.. తనే నా రెండో భర్త అని నమ్రత అన్నారు దీనిపై మీ రియాక్షన్ ఎంటి? అని మీడియా అడిగిన ప్రశ్నకు మహేష్ ఏమాత్రం తడుముకోకుండా రియాక్ట్ అయ్యారు. ``అచ్చు గుద్దినట్టు నాలాగే ఉండంతో ఇద్దరు మహేష్ బాబులు అనే అర్థం వచ్చేలా నమ్రత ఆ కామెంట్ చేశారు. అందులో మరో అర్థం ఏదీ లేదు`` అని అన్నారు.

మహేష్ - నమ్రత టాలీవుడ్ లోనే ఆదర్శ జంటగా వెలిగిపోతున్నారు. మహేష్ పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. ఎంతగా విదేశీ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నా నమ్రత పిల్లలతో కలిసి వెకేషన్లు ప్లాన్ చేస్తూ ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తున్న హీరోగానూ మహేష్ పొగడ్తలు అందుకుంటున్నారు. ఆ మైనపు విగ్రహం చెంత మహేష్ ని చూడగానే కవలలా? అన్న సందేహాలు అందరికీ కలిగాయి మరి. అందుకే ఆ కన్ఫ్యూజన్ లో నమ్రత అలా అన్నారన్నమాట!! ఆయనకు ఇద్దరు అవసరం లేదు.. ఆ మైనపు విగ్రహమే రెండో భర్తలా కవ్విస్తోంది కదా!!