Begin typing your search above and press return to search.

బస్సు టిక్కెట్లు అమ్మనున్న మహేష్‌

By:  Tupaki Desk   |   29 Sep 2016 1:15 PM GMT
బస్సు టిక్కెట్లు అమ్మనున్న మహేష్‌
X
ఆల్రెడీ కుర్రాళ్లతో థమ్సప్ తాగిస్తున్నాడు. పారగాన్ చెప్పులు వేసుకోమంటున్నాడు. రాయల్ స్టాగ్ మ్యూజిక్ సిడిలు వినమంటున్నాడు. వివెల్ షాంపూతో స్నానం చేయండి.. సంతూర్ వాడండి అంటున్నాడు. అమరావతిలో ప్లాట్లు కొనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఇలాగే మరో నిర్దేశం కూడా చేయనున్నాడు సూపర్ స్టార్ మహేష్‌ బాబు. ఇదంతా మనోడి బ్రాండింగాలజీ గురించేనని అర్ధమైయ్యిందిగా. పదండి చూద్దాం.

బ్రాండ్ ఎండార్స్ మెంట్లో మహేష్‌ బాబు స్థాయి వేరు. మనోడు సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు కూడా ప్రొవోగ్ వంటి నేషనల్ బ్రాండ్స్ ను ఎండార్స్ చేసి అదరగొట్టాడు. అయితే ఇప్పుడు కొత్తగా ఆన్ లైన్ టిక్కెటింగ్ కంపెనీ ఒక దానిని ఎండార్స్ చేయనున్నాడు. అభిబస్.కామ్ వెబ్ సైట్ కు మనోడు బ్రాండ్ అంబాసిడర్ గా చేయనున్నాడు. ఈ సంస్థ తాలూకు తొలి యాడ్ ను త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్నాడు. అంటే త్వరోలనే మహేష్‌ మనల్ని ఆన్ లైన్లో బస్సు టిక్కెట్లు కూడా కొనమని సలహాలు ఇస్తాడనమాట.

ఇప్పటికే చాలా బ్రాండ్లను తన కిట్టీలో వేసుకున్న మహేష్‌.. అసలు వేరే హీరోలు ఎవ్వరూ పోటీ ఇవ్వలేనంత రేంజులో పిచ్చెక్కిస్తున్నాడు కదూ. సూపరంటే సూపరే మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/