Begin typing your search above and press return to search.

కూతురంటే ఎంత ప్రేమో..

By:  Tupaki Desk   |   13 March 2018 7:14 AM GMT
కూతురంటే ఎంత ప్రేమో..
X
ఎంత‌టి సెలెబ్రిటీ అయినా... త‌న పిల్ల‌లంటే ప‌డి చావాల్సిందే. అందులోనూ క‌న్న‌పిల్ల‌లు త‌మ అమ్మ‌కో నాన్న‌కో ప్రతిరూపాల్లా ఉంటే... ఆ ఆనంద‌మే వేరు. మ‌హేష్ బాబు త‌న‌కు కూతురు పుట్టిన‌ప్ప‌టి ఉంచి అదే ఆనందంలో మునిగితేలుతున్నాడు. కూతురు సితారంటే అత‌నికి ఎంత ప్రేమో ఇప్ప‌టికే మ‌నంద‌రికీ తెలుసు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్రిన్స్ కూడా ఆ విష‌యాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేస్తూనే ఉన్నాడు.

మ‌హేష్‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. ఇద్ద‌రిలో చిన్న‌ది సితార‌. అయిదేళ్ల ఈ పిల్ల చేసే అల్ల‌రంటే తండ్రి మ‌హేష్‌కు ఎంతిష్ట‌మో. సితార రూపురేఖ‌లు మ‌హేష్ త‌ల్లి ఇందిర‌లా ఉంటాయి. ఆ విష‌యాన్ని చాలా సార్లు చెప్పాడు అత‌ను. ఇదిగో ఇప్పుడు మరొక్క‌సారి చెబుతూ ఆనంప‌డ్డాడు. గులాబీ రంగు నేప‌థ్యంలో ఉన్న సితార ఫోటోను పోస్టు చేసి... పింక్ గ‌ర్ల్ ప‌వ‌ర్‌... అచ్చు మా అమ్మ‌లా క‌నిపిస్తోంది అని క్యాప్ష‌న్ పెట్టాడు. ఇందిర చిన్న‌ప్ప‌టి రూపాన్ని సితార‌లో చూసుకుంటున్నాడు మ‌హేష్‌. అమ్మ‌లాంటి కూతురు పుడితే ఏ కొడుకు మాత్రం పొంగిపోడు.

సితార‌-మ‌హేష్‌ ల అనుబంధం ప్రేమ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. న‌మ్ర‌తా కూడా సితార గురించి ప‌లు పోస్టులు చేస్తుంటుంది. ఈ మ‌ధ్యనే రింగులుగా ఉన్న జుట్టును స్ట్రెయిట్‌గా మార్చుకుంది సితార‌. ఆ జుట్టును నాన్న‌కు చూపించాల‌ని... అమ్మ‌తో క‌లిసి షూటింగ్ స్పాట్ కు వెళ్లిపోయింది. తన జుట్టును తండ్రికి చూపించి మురిసిపోయింది.