Begin typing your search above and press return to search.

మహేష్‌ ర్యాంకింగ్ పడిపోతోందే??

By:  Tupaki Desk   |   27 Jun 2017 8:10 AM GMT
మహేష్‌ ర్యాంకింగ్ పడిపోతోందే??
X
ప్రతీ ఏటా టైమ్స్ ఆఫ్ ఇండియా వారు 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' అనే ఒక పోలింగ్ పెడతారన్న సంగతి తెలిసిందే. అయితే ఇండియావైడ్ జరిగే ఈ పోల్ లో ఈ మధ్యకాలంలో మన సూపర్ స్టార్ హవా తగ్గుతోంది అనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా ప్రతీ ఏటా ఆయన తన ర్యాంకును కాస్త కాస్త తగ్గించుకుంటూ పోతున్నారు. దానికి అనేక కారణాలు ఉండగా.. అందులో ముఖ్యంగా ఓట్ల సంఖ్య తగ్గుతోంది అని తెలుస్తోంది.

2013లో మోస్ట్ డిజైరబుల్ 50 లిస్టులో మహేష్‌ ఏకంగా నెం.1 స్థానంలో ఉన్నాడు. అప్పట్లో మనోడికి ఏకంగా 7.34 లక్షల ఓట్లు వచ్చాయి. ఇక 2015 నాటికి 6వ స్థానానికి వచ్చేశాడు. ఇప్పుడు 2016కు గాను మనోడు 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు ప్రకటించిన 2016 డిజైబుల్ లిస్టులో.. మిష్టర్ ఇండియా రోహిత్ కందేల్వాల్ నెం.1 స్థానం కైవసం చేసుకున్నాడు. అలాగే విరాట్ కొహ్లీ నెం.2 స్థానంలో ఉన్నాడు. ఇక హృతిక్ రోషన్ 3వ పొజిషన్లో ఉండగా.. గతేడాది నెం.1 స్థానం కొట్టిన రణవీర్ సింగ్ ఇప్పుడు 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ టాప్ 50 లిస్టులో మన తెలుగు నుండి సెలక్ట్ అయిన ఇతర స్టార్లను చూస్తే.. 22వ స్థానంలో ప్రభాస్.. 24వ స్థానంలో రానా దగ్గుబాటి ఉండగా.. గతంలో ఈ లిస్టులో క్రేజ్ సాధించిన రామ్ చరణ్‌ మాత్రం ఏకంగా టాప్ 50 నుండే ఎగిరిపోయాడు. కాకపోతే ప్రభాస్ కు ఉన్న క్రేజేంటో బాహుబలి ద్వారా కనిపించాక.. ఈ లిస్టుకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటని తెలుగు ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. కాని గతంలో మనోళ్ళందరూ టాప్ 10లో ఉన్నప్పుడు ఈ లిస్టును తెగ పొగిడేసి.. ఇప్పుడు మనోళ్ళు లేరని క్రెడిబిలిటీ గురించి ప్రశ్నిస్తే.. మన క్రెడిబిలిటీ కోల్పోయే ఛాన్సుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/