Begin typing your search above and press return to search.

మహేష్ ని డిజప్పాయింట్ చేసిన ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   25 Oct 2016 5:21 AM GMT
మహేష్ ని డిజప్పాయింట్ చేసిన ఫ్యాన్స్
X
మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ తో సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. కీలక సన్నివేశాల కోసం భారీ సెట్స్ వేసి మరీ 20 రోజులుగా షూటింగ్ కొనసాగిస్తున్నారు. మరో వారంపాటు ఇక్కడే ఉండాల్సి వస్తుందట మహేష్. అయితే.. రీసెంట్ గా ఈ స్పాట్ కి సూపర్ స్టార్ అభిమానులు కొందరు వచ్చారు. వేరే జిల్లాల నుంచి తన కోసం అంతదూరం వచ్చిన ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయడం ఇష్టం లేని సూపర్ స్టార్.. వారి కోరిక మేరకు ఫోటోలు సెల్ఫీలు దిగాడట.

అయితే తను షూటింగ్ స్పాట్ నుంచి దిగిన ఫోటోలు సాయంత్రాని కల్లా ఆన్ లైన్ హల్ చల్ చేస్తుండే సరికి ఆశ్చర్యపోయాడట సూపర్ స్టార్. వాళ్లతో ఫోటో దిగే సమయంలోనే.. కేవలం వ్యక్తిగతంగా దాచుకోవడానికే ఉపయోగించమని.. రివీల్ చేయద్దని మరీ మరీ చెప్పాడట మహేష్. అయితే.. తమ ఆనందాన్ని ఆపుకోలేని ఆ ఫ్యాన్స్.. సోషల్ సైట్లలో పోస్ట్ చేసేయడం.. నెట్టింట్లో షేరింగ్స్ తో హల్ చల్ చేసేయడం జరిగిపోయాయి. ఈ పరిణామంతో షాక్ తిన్న మహేష్ బాబు.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోటోలు దిగకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ అఫీషియల్ గా రివీల్ చేసే వరకూ.. తన గెటప్ రివీల్ కాకుండా మహేష్ బాబు చాలానే జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఆ రూల్ ని ఫ్యాన్స్ కోసం బ్రేక్ చేస్తే.. వాళ్లే మహేష్ ని డిజప్పాయింట్ చేసేయడంతో.. మళ్లీ తన పాత రూటే కరెక్ట్ అంటున్నాడట మహేష్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/