Begin typing your search above and press return to search.

మహేశ్ ఈసారైన అరవంలో నిలబడతాడా!

By:  Tupaki Desk   |   23 Sep 2017 6:01 AM GMT
మహేశ్ ఈసారైన అరవంలో నిలబడతాడా!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన మార్కెట్ పరిధి పెంచుకోవడానికి తమిళంలో కూడా తన సినిమాల్ని విడుదల చేయిస్తున్నాడు. ఇప్పటికే మహేశ్ నటించిన ఆగడు - బ్రహ్మోత్సవం వంటి సినిమాలు తమిళంలో విడుదలైయ్యాయి. మళయాలంలో కూడా మహేశ్ సినిమాలు అప్పడప్పుడు విడుదల అవుతున్నాయి. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే మహేశ్ నుంచి ఇతర భాషల్లోకి ఎక్స్ పోర్ట్ అవుతున్న ఈ సినిమాల్ని అక్కడ ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంతవరుకు మహేశ్ తమిళంలో విడుదల చేసిన తన అనువాద సినిమాలు తెలుగులో కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో సొంత ఏరియాల్లో హిట్ కొట్టని సినిమాలు వేరే భాషల్లో ఎలా సక్సెస్ అవుతాయనే విమర్శలు వస్తున్నాయి.

అయితే తెలుగులో సూపర్ డూపర్ హిట్ కొట్టిన శ్రీమంతుడు తమిళంలో పెద్దగా ఆడలేదు. దీనికి కారణం నెటివిటి అనే లాజిక్ ని తెర పైకి తీసుకొచ్చి ఇప్పుడు మహేశ్ అప్ కమింగ్ మూవీ స్పైడర్ ని కూడా తమిళంలో విడుదల చేస్తున్నారు. ఇటీవలే చెన్నైలో భారీ రేంజ్ లో ఆడియో ఫంక్షన్ కూడా నిర్వహించారు. స్పైడర్ తో అయినా తమిళ మార్కెట్ లో షేర్ దక్కించుకునేందుకు మహేశ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంతోనే మురుగదాస్ చెప్పిన స్పైడర్ స్టోరీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మురుగదాస్ సినిమాలు తమిళ నెటివిటీకి దగ్గరగా ఉండటం, తెలుగులో కూడా ఈ డైరెక్టర్ కి పాపులారిటీ ఉండటంతో రెండు భాషల్లో కూడా తాను నెగ్గుకురావడానికి మురుగదాస్ హెల్ప్ అవుతాడనే ఉద్దేశంతో మహేశ్ ఈ స్పైడర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి మహేశ్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరుకు సక్సెస్ అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.