మ్! సితారతో ఆలియా!!

Sat Oct 20 2018 09:52:18 GMT+0530 (IST)

ఈ ఫోటో చూస్తే .. ఇంతకీ ఎవరు ఎవరితో ఫోటో దిగారు?   సితారతో ఆలియా దిగిందా? ఆలియాతో సితార దిగిందా? ఇదో ఫజిల్ లా ఉంది కదూ? అంతగా పాపులరైపోయింది బేబి సితార. క్యూట్ సితారతో ఫోటో దిగితే అవతలివాళ్లు కనిపించడం లేదు. అంతగా ముద్దొచ్చేస్తోంది. అంతేకాదు.. ఫోటోలకు ఫోజులివ్వడంలో మమ్మీ డాడీలనే మించిపోతోంది. స్మైలీ ఫేస్ తో సింపుల్ గా స్నాప్ లకు అలవాటుపడిపోయింది సితార. ఒక్క ఫోటో ప్లీజ్ అంటే చాలు.. పొజిషన్ లోకి వచ్చేసి స్మైలిచ్చేస్తోంది.ఇదిగో ఇక్కడ ఆలియా కంటే సితారనే సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. అన్నట్టు సితార ఫేవరెట్ స్టార్ ఎవరో తెలుసా?  బాలీవుడ్ క్యూటీ ఆలియా అట. ఆ సంగతిని నమ్రత తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఆలియాతో సితార ఫోటోని ట్వీట్ చేసిన నమ్రత.. ``టుడే సితార డే.. తన ఫేస్ లో చక్కని స్మైల్ కి కారణమైన ఆలియాకి థాంక్స్`` అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

మహేష్ ప్రస్తుతం అమెరికాలో మహర్షి చిత్రీకరణలో బిజీ. అక్కడ మాస్టర్ గౌతమ్ కూడా దర్శనమిచ్చాడు. గౌతమ్ తో పాటే సితార అక్కడే ఉంది. అన్నతో కలిసి షాపింగులు - షికార్లు అంటూ తిరిగేస్తున్నట్టే ఈ ఫోటోలు వీక్షిస్తే అర్థమవుతోంది. నమ్రత షేర్ చేసిన ఫోటోల్లో క్యూట్ సితార అంతే క్యూట్ గా ఉన్న ఓ ఉడత(స్క్విరల్)తో ఆడుకుంటోంది. వేరొక ఫోటోలో రోబోట్ తో ఆడుకుంటున్నారు అన్నాచెల్లెళ్లు. స్కూల్స్ కి దసరా  సెలవులు ఇచ్చారు కాబట్టి.. హ్యాపీ డే.. జాలీడేస్ ఇలా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట!!