Begin typing your search above and press return to search.

స్పెయిన్ లో ఆడుతున్న మహేష్ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   18 May 2018 6:25 AM GMT
స్పెయిన్ లో ఆడుతున్న మహేష్ ఫ్యామిలీ
X
ప్రస్తుతం వెకేషన్స్ సీజన్ నడుస్తోంది. సమ్మర్ కావడంతో.. జనాలంతా తమ స్థాయి ఆధారంగా విహార యాత్రలు చేస్తున్నారు. సరిహద్దులు దాటి పక్క దేశాలకు షికార్లు కొట్టేస్తున్నారు కూడా. సెలబ్రిటీల విహార యాత్రలు అందరినీ ఆసక్తి కలిగిస్తాయి. ఇలాంటి టూర్స్ వేయడంలో మహేష్ బాబుకు మంచి గుర్తింపే ఉంది.

ఏటేటా మాత్రమే కాదు.. అడపాదడపా కూడా కుటుంబంతో కలిసి షికార్లు కొట్టేస్తుంటాడు సూపర్ స్టార్. అయితే.. ప్రతీ ఏటా సమ్మర్ లో మాత్రం యూరోప్ టూర్ కచ్చితంగా వెళ్లడం వీరి ఆనవాయితీ. ఈ సారి కూడా మహేష్ అండ్ టీ యూరోప్ వెళ్లారు. అయితే.. ఎప్పుడూ పారిస్ లో ఎక్కువగా ఉండే సూపర్ స్టార్ కుటుంబం.. ఈ సారి వెన్యూ మార్చారు. ఫ్రాన్స్ కు కాకుండా.. స్పెయిన్ లో వాలిపోయారు. ఈ విషయాన్ని మహేష్ వైఫ్ నమ్రతా శిరోద్కర్ స్వయంగా చెప్పింది. చెప్పడమే కాదు.. చూపించింది కూడా.

స్పెయిన్ లో టెన్నిస్ కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఇప్పుడు మహేష్ కూతురు సితార కూడా తెగ టెన్నిస్ ప్రాక్టీస్ చేసేస్తోంది. అంతటి ఎండలో కూడా బోలెడంత సేపు ఆడిందంటే.. ఆమెకు ఈ క్రీడపై ఎంత మక్కువో అర్ధమవుతుంది. తమ కూతురు సితార.. టెన్నిస్ ఆడుతున్న ఫోటోలను నెట్ లో షేర్ చేసింది నమ్రతా శిరోద్కర్.