మహేష్ గారాలపట్టి క్లాసికల్ డ్యాన్సర్!

Wed Feb 20 2019 10:44:37 GMT+0530 (IST)

సూపర్‌స్టార్ మహేష్ సినిమాల కంటే ఫ్యామిలీ పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. ఏ చిన్న సంతోషాన్ని అయినా సోషల్ మీడియాలో పంచుకోవడం అలవాటు. ఇటీవల తన పిల్లలతో సరదాగా గడిపిన ఫొటోలని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్న మహేష్ తనకు పిల్లలపై వున్న ప్రేమను చాటుకున్నారు. నమ్రత కూడా మహేష్ తరహాలోనే ప్రతి సందర్భాన్ని.. ప్రతి ఈవెంట్‌ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వుంటారు. తాజాగా తన గారాల పట్టి సితార ఫొటోలని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.మహేష్‌తో పాటు సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్న సితార క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటోంది. గత కొంత కాలంగా మహేష్‌కు సంబంధించిన పాటలతో సోషల్ మీడియాలో హంగామా చేసిన సితార ఇటీవల క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటోంది. ప్రముఖ నృత్య శిక్షకురాలు అరుణ భిక్షు నేతృత్వంలో సితార క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోల్ని నమ్రత సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఇదివరకూ సితార గౌతమ్ ల కోసం ఒక డాడ్ గా మహేష్ స్కూల్ కి వెళ్లి ప్రోగ్రెస్ రిపోర్టుల్లో సంతకాలు పెట్టి రావడం గురించి ఆసక్తికర చర్చ సాగింది. విదేశాల్లో మహేష్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ గురించి తెలిసిందే. ఇక మహేష్ వారసుడు గౌతమ్ వేగంగా ఎదిగేస్తున్నాడు. తన అప్ డేట్స్ మరిన్ని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కెరీర్ 25వ సినిమా మహర్షి లో నటిస్తున్న మహేష్ తదుపరి అనీల్ రావిపూడి సుకుమార్ సందీప్ రెడ్డి వంటి ట్యాలెంటెడ్ దర్శకులతో సినిమాల్లోనటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.