కేసీఆర్ కు కృష్ణ... కేటీర్ కు మహేష్

Tue Dec 11 2018 22:28:40 GMT+0530 (IST)

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ భారీ మెజార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ పార్టీకి - కేసీఆర్ మరియు కేటీఆర్ లకు సినీ ప్రముఖులు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఈసమయంలోనే సూపర్ స్టార్స్ కృష్ణ మరియు మహేష్ బాఋ టీఆర్ ఎస్ ప్రభుత్వంకు శుభాకాంక్షలు తెలియజేశారు.కృష్ణ ప్రెస్ నోట్ లో సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెల్సిందే. అయితే మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలంగాణ ఎన్నికలపై స్పందించాడు. కేటీఆర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విజయానికి మీరు పూర్తిగా అర్హులు. మీ పాలన మరింత మంచిగా కొనసాగిస్తారని భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

కృష్ణ ప్రెస్ నోట్ లో కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపగా - కేటీఆర్ కు మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖులు దాదాపుగా అంతా కూడా టీఆర్ ఎస్ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేటీఆర్ మరియు టీఆర్ ఎస్ నాయకులను సినీ ప్రముఖులు శుభాకాంక్షలతో ముంచేస్తున్నారు.