గ్యాప్ లో థాయ్ ల్యాండ్ ట్రిప్ ముగించి

Fri Sep 21 2018 22:03:20 GMT+0530 (IST)

అరే .. సందు దొరికితే చాలు మహేష్ మటుమాయం అవుతాడు. ఫ్యామిలీ ట్రిప్ అంటూ సూదూర తీరాలకు వెళ్లిపోతున్నాడు. అప్పటికప్పుడే ఫ్యామిలీతో చిలౌట్ ప్లాన్ చేస్తున్నాడు. ఇన్నాళ్లు సినిమా పూర్తయ్యాకే ఫ్యామిలీ వెకేషన్ వెళుతున్నాడని అనుకుంటే.. ఇప్పుడు షూటింగ్ మధ్యలో చిన్న గ్యాప్ దొరికినా చాలు పాదరసంలా కొత్త ట్రిప్ ప్లాన్ చేసేస్తున్నాడు. కుటుంబ సమేతంగా విదేశీ ట్రిప్‌లకు వెళ్లి జాలీగా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.ప్రస్తుతం కెరీర్ 25వ సినిమా `మహర్షి` షూటింగులో బిజీగా ఉన్నాడు. ఇటీవల గత కొంతకాలంగా అమెరికాలో పాగా వేసి మహర్షి చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అక్కడ ఉండగానే ఓ చిన్న గ్యాప్ దొరకగానే నేరుగా థాయ్ ల్యాండ్ వెళ్లిపోయాడు. నమ్రతతో కలిసి థాయ్ -కో సముయ్ అనే ఎగ్జోటిక్ లొకేషన్‌కి వారం క్రితమే ట్రిప్ వెళ్లాడు. అటుపై అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కి వచ్చేస్తున్నానంటూ మహేష్ రిటర్న్ జర్నీ గురించి హింట్ ఇచ్చేశాడు. అంటే ఒకట్రెండ్రోజుల్లోనే తిరుగు పయనం ఉంటుందన్నమాట! అటుపై మళ్లీ అక్టోబర్ లో అమెరికా వెళతాడట. అక్కడ సుదీర్ఘ కాలం ఓ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటాడని తెలుస్తోంది. ఎప్పుడెళ్లాడో ఎప్పుడొస్తున్నాడో అన్న చందంగా చకచకా వెకేషన్ పూర్తి చేసుకుని రిటర్న్ వచ్చేస్తున్నాడు.

వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అశ్వనిదత్- దిల్ రాజు- పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ కెరీర్ ల్యాండ్ మార్క్ సినిమా కాబట్టి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ చిత్రానికి బడ్జెట్ ని సమకూరుస్తున్నారు. మహేష్ ఈ చిత్రంలో కాలేజ్ విద్యార్థిగా - రైతుగా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. వచ్చే సమ్మర్ లో సినిమా రిలీజ్ కానుంది.