Begin typing your search above and press return to search.

చరణ్‌, ప్రభాస్ పై మహేష్‌ ఏమన్నాడంటే..

By:  Tupaki Desk   |   29 Nov 2015 11:30 AM GMT
చరణ్‌, ప్రభాస్ పై మహేష్‌ ఏమన్నాడంటే..
X
టాలీవుడ్ లో నెంబర్ రేస్ కి పోటీ ఇచ్చే స్టార్ హీరోల్లో ఫస్ట్ వినిపించేది మహేష్ బాబు పేరే. మరి మహేష్ దృష్టిలో పోటీ వచ్చేదెవరు ? ఈ ప్రశ్నకి మిగతా వాళ్లకంటే సూపర్ స్టార్ స్వయంగా ఆన్సర్ ఇస్తే.. ఇంకా సూపర్ గా ఉంటుంది కదూ. ఇప్పుడదే జరిగింది. తనకు పోటీ ఎవరో మహేష్ స్వయంగానే చెప్పేశాడు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మీది పోటీ పడే తత్వమా అనే ప్రశ్న మహేష్ కి ఎదురైంది. దీనికి "అవును నేను చాలా పోటీ పడతాను. నేను రామ్ చరణ్ - ప్రభాస్ లు ఒకే రంగంలో ఒకే విభాగంలో ఉన్నాం. ఇక్కడ చాలా మందికి కావలసినంత అవకాశం ఉంది. అయితే పోటీ పరంగా చూసుకుంటే.. నేను నా సినిమాలతో పోటీ పడడానికే ఇష్టపడతాను. ఇప్పుడు శ్రీమంతుడు ఇంతగా సక్సెస్ సాధించింది. నా తర్వాతి మూవీ ఇంకా బెటర్ గా ఉండాలని కోరుకుంటాను. మిగిలిన స్టార్స్ తో పోటీ పడాలనే ఆలోచన నాకు ఉండదు" అన్నాడు మహేష్ బాబు.

పొజిషన్ పరంగా చరణ్ - ప్రభాస్ లు పోటీ అని చెప్పకనే చెప్పాడు సూపర్ స్టార్. కాకపోతే సినిమాల పరంగా మాత్రం సొంత సినిమాలు - రికార్డులనే టార్గెట్ చేస్తానన్నాడు. కానీ అసలు టాలీవుడ్ లో నెంబర్ వన్ రేస్ అంటే మహేష్ బాబు - పవన్ ల మధ్యన ఉంటుందని భావిస్తుంది ఇండస్ట్రీ. మరి పవన్ తో పోటీ సంగతి మహేష్ ఎందుకు చెప్పలేదో ? నిజానికి ఇక్కడో సంగతి ఉంది లెండి. పవన్ అంటే మహేష్ బాబుకి చాలా అభిమానం. పవర్ స్టార్ తో పోటీ అనే మాటను చాలాసార్లు నవ్వుతూనే కొట్టిపడేశాడు మహేష్ బాబు. అదీ సంగతి.