Begin typing your search above and press return to search.

బాలీవుడ్ గురించి అంత మాటనేశాడేంటి

By:  Tupaki Desk   |   18 Dec 2018 11:30 AM GMT
బాలీవుడ్ గురించి అంత మాటనేశాడేంటి
X
మన హీరోల్ని కేవలం తెలుగు స్టార్లు గా గుర్తించే రోజులు పోయాయి. ఇప్పడు వాళ్లు బౌండరీలు దాటిపోయారు. దక్షిణాదిన అంతటా మార్కెట్‌ విస్తరిస్తున్నారు. యూట్యూబ్ లో.. హిందీ ఛానెళ్లలో డబ్బింగ్ సినిమాల జోరు తో ఉత్తరాదిన కూడా వారికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ‘బాహుబలి’ తర్వాత తెలుగు హీరోల్ని మిగతా భాషల ప్రేక్షకులు చూసే కోణమే మారిపోయింది. ఐతే ప్రభాస్ కంటే ముందే మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఉత్తరాదిన గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ హీరోల ఫీచర్లు ఉండే మహేష్ కు అక్కడి వాళ్లు బాగానే కనెక్టయ్యారు. అతను చేసిన కొన్ని ప్రకటనలు జాతీయ స్థాయిలో ప్రసారం అయ్యాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా మహేష్ అక్కడి వాళ్ల కు చేరువ అయ్యాడు. ఈ నేపథ్యం లో మహేష్ ఓ హిందీ సినిమా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది.

బాలీవుడ్ ఫిలిం మేకర్స్‌ కు సైతం మహేష్‌ తో సినిమా చేసే ఉద్దేశం ఉన్నట్లుగా సంకేతాలు ఇంతకు ముందే అందాయి. కానీ మహేష్ మాత్రం ఆ దిశ గా ప్రయత్నాలు చేసింది లేదు. ఆ విషయం ఎత్తితే మహేష్ ఇంతకు ముందు నవ్వి ఊరుకునేవాడు. లేదంటే ఆసక్తి లేదనేవాడు. కానీ తాజా గా ఒక ప్రమోషనల్ ఈవెంట్లో మాత్రం అతను షాకింగ్ కామెంట్ చేశాడు. ఇక్కడ తెలుగు లో సినిమాలు చేసుకుంటూ సంతోషం గా ఉన్నానని.. బాలీవుడ్‌ కు వెళ్లి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని మహేష్ బాబు షాకింగ్ కామెంట్ చేశాడు. తాను బాలీవుడ్‌ కు వెళ్లడం టైం వేస్ట్ వ్యవహారమని మహేష్ తేల్చేయడం చర్చనీయాంశమవుతోంది. ఈ కామెంట్ ను బాలీవుడ్ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో మరి. ఓవైపు సౌత్ సినిమా గురించి బాలీవుడ్ వాళ్లు గొప్పగా మాట్టాడుతుంటే.. మహేష్ బాలీవుడ్ గురించి ఇలా కామెంట్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘స్పైడర్’తో తమిళంలోకి వెళ్లబోయి చేతులు కాల్చుకున్న నేపథ్యంలో ఇక బాలీవుడ్ అనేసరికి మహేష్ కు ఫ్రస్టేషన్ వచ్చేసిందేమో మరి.