Begin typing your search above and press return to search.

రాజమౌళి-మహేష్ కాంబో అప్పుడే!!

By:  Tupaki Desk   |   24 Sep 2017 5:41 AM GMT
రాజమౌళి-మహేష్ కాంబో అప్పుడే!!
X
సినిమా కథ ఎలా ఉన్నా సరే కొన్ని కాంబినేషన్స్ ఉంటే చాలు ఆ సినిమాకి ఊహించని స్థాయిలో విజయాన్ని అందిస్తాయి. ఇక్కడ కాంబో అంటే మెయిన్ గా చెప్పుకోవాల్సింది. కథానాయకుడు - దర్శకుడు అని. సినిమా కథ బలంగా తెరపై కనిపించాలంటే దర్శకుడి మేకింగ్ హీరో ఇమేజ్ సెట్ అయితే ఆ సినిమా మరో స్థాయికి వెళుతుంది. అయితే ఎంతో కాలంగా మన టాలీవుడ్ లో కొన్ని కంబోలు సెట్ అవ్వడం లేదు. ఆ కాంబినేషన్ సెట్ అవ్వాలని ప్రేక్షకులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆ కాంబినేషన్ ఏమిటని అనికుంటున్నారా?. దర్శకధీరుడు రాజామౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ . ఈ జోడిని ఎప్పటినుంచో ప్రేక్షకులు చూడలనుకుంటున్నారు. వీరిద్దరూ కూడా కలిసి చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారిద్దరి కలయికలో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి కాంబో కి కరెక్ట్ కాన్సెప్ట్ సెట్ అవుతేనే.. ముందుకు వెళ్లాలి. రాజమౌళి కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. మహేష్ కూడా జక్కన్న తో చేయాలని ఉందని చాలా సార్లు చెప్పారు. ఇదే విషయంపై స్పందించిన మహేష్‌.. తన ప్రస్తుత కమిట్మెంట్లు అయిపోగానే రాజమౌళితో సినిమానే అని చెప్పేశాడు.

అయితే ఈ భారీ కాంబో సెట్స్ పైకి వెళ్లాడానికి కొంచెం టైమ్ పడుతుంది. కానీ ఫైనల్ గా మాత్రం సినిమా పక్కాగా వస్తుంది. ఎందుకంటే ప్రిన్స్ చాలా బిజీగా ఉన్నాడు. మహేష్ ప్రస్తుతం స్పైడర్ రిలీజ్ హాంగామాలో ఉన్నాడు. ఇది అయిపోగానే కొరటాల శివ - దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటాడు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఒకే చేశాడు. ఈ రెండు సినిమాలు అయిపోవలంటే నెక్స్ట్ ఇయర్ వరకు టైమ్ పడుతుంది. సో రాజమౌళి - మహేష్ కాంబినేషన్ లో సినిమా 2019 లో తప్పకుండా వస్తోంది అని మనం అర్థం చేసుకోవచ్చు.