Begin typing your search above and press return to search.

తిరుమ‌ల పోలీసుల అదుపులో బ్ర‌హ్మోత్స‌వం టీం!

By:  Tupaki Desk   |   14 Feb 2016 10:32 AM GMT
తిరుమ‌ల పోలీసుల అదుపులో బ్ర‌హ్మోత్స‌వం టీం!
X
మ‌హేశ్ బాబు క‌థానాయకుడిగా న‌టిస్తున్న బ్రహ్మోత్స‌వం చిత్ర బృందానికి చెందిన వీడియోగ్రాఫ‌ర్లు అనుమానాస్ప‌ద రీతిలో వ్య‌వ‌హ‌రించి తిరుమ‌ల పోలీసుల‌కు దొరికిపోయారు.ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీవారి గ‌రుడ సేవ‌ల్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అత్యాధునిక కెమేరాల‌తో ఈ సేవ‌ల్ని చిత్రీక‌రిస్తున్న వీడియోగ్రాఫ‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచార‌ణ‌లో వీరిద్ద‌రూ తాము బ్ర‌హ్మోత్స‌వం చిత్రం కోసం వీడియోల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అనుమ‌తి తీసుకున్నారా? అన్న ప్ర‌శ్న‌కు లేద‌ని తేల‌టం.. అనుమ‌తి లేకుండా సేవ‌ల్ని ఎలా చిత్రీక‌రిస్తార‌ని పోలీసులు విచారిస్తున్నారు. శ్రీకాంత అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయినా..సినిమాకు అవ‌స‌ర‌మైతే.. అధికారికంగా అనుమ‌తి తీసుకుంటే స‌రిపోయేదానికి.. ఇలాంటి ప‌నులు చేయ‌టం ఎందుక‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.