Begin typing your search above and press return to search.

అమ్మకాల్లో మహేష్ పండగ చేసేస్తున్నాడు

By:  Tupaki Desk   |   2 May 2016 4:23 AM GMT
అమ్మకాల్లో మహేష్ పండగ చేసేస్తున్నాడు
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్ట్స్ మూవీ పేరే ఓ పండగ. బ్రహ్మోత్సవం అంటూ పెద్ద పండగ చేసేస్తానని ముందే టైటిల్ తో హిట్ ఇచ్చేశాడు మహేష్. ఇప్పుడు సినిమా రిలీజ్ కి టైం దగ్గరపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే మూవీ రిలీజ్ అని చెప్పేశారు. మే 7న బ్రహ్మోత్సవం ఆడియో వేడుకను బ్రహ్మాండమైన లెవెల్లో చేయబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు పండగ స్టార్ట్ అయిపోయింది. టీజర్ రిలీజ్ తో ఈ వేడుకను అఫీషియల్ గానే స్టార్ట్ చేసిన మహేష్.. అమ్మకాల విషయంలో నిర్మాతలకు కూడా పండగ చేసేస్తున్నాడు. బ్రహ్మోత్సవంకు అన్ని ఏరియాల నుంచి రికార్డ్ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయి. నైజా ఏరియాలో ఏకంగా 21కోట్లు పలికింది బ్రహ్మోత్సవం. రీసెంట్ టైంలో ఏ తెలుగు సినిమాకైనా ఇది ఎక్కువే. ఇంత మొత్తం చెల్లించి అభిషేక్ పిక్చర్స్ బ్రహ్మోత్సవం నైజాం రైట్స్ దక్కించుకుంది.

ప్రస్తుతం బ్రహ్మోత్సవంలో ఒక పాట మినహాయిస్తే.. మిగిలిన షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది. మే 3నుంచి ఈ పాట పిక్చరైజేషన్ మొదలుపెట్టనున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న మూవీ కావడంతో.. బ్రహ్మోత్సవంపై ఇండస్ట్రీలో చాలానే అంచనాలు ఉన్నాయి.