Begin typing your search above and press return to search.

చంపేస్తున్నావ‌య్యా మ‌హేషూ..

By:  Tupaki Desk   |   30 April 2016 1:47 PM GMT
చంపేస్తున్నావ‌య్యా మ‌హేషూ..
X
బ్ర‌హ్మోత్స‌వం ప్రారంభోత్స‌వం రోజు రిలీజ్ చేసిన లోగోనే ఒక ర‌క‌మైన పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చింది జ‌నాల్లో. ఆ త‌ర్వాత ఆ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ప్ర‌తి ఫొటో.. ప్ర‌తి పోస్ట‌రూ చాలా క‌ల‌ర్ ఫుల్ గా ఉంటూ ఆ పాజిటివ్ వైబ్రేష‌న్ ను మ‌రింత పెంచాయి. సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో అభిమానుల్లో మ‌రింత ఉత్సాహం నింపేలా మ‌రిన్ని పోస్ట‌ర్ల‌తో కొడుతోంది బ్ర‌హ్మోత్స‌వం టీమ్‌. గ‌త రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల‌యితే మామూలుగా లేవు. వైబ్రంట్ క‌ల‌ర్స్ లో క‌ళ్లు చెదిరే బ్యాగ్రౌండ్ లో అంద‌మైన మ‌హేష్ ను చూస్తుంటే అభిమానులు ఆగ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా మ‌హేష్ లేడీ ఫ్యాన్సుకైతే ఈ ఫొటోలు చూసి పిచ్చెక్కి పోతోంది.

శ్రీమంతుడులో ఇంట‌ర్వెల్ ముందు బ‌స్సెక్కుతూ రైట్ రైట్ అన్న‌పుడు వేసుకున్న త‌ర‌హా టీష‌ర్టులో ఉన్న పోస్ట‌ర్ ఒక‌టి.. స‌మంత‌తో క‌లిసి ఉల్లాసంగా ఉన్న పోస్ట‌ర్‌ మ‌రొక‌టి.. లేటెస్టుగా దాండియా ఆడుతున్న పోస్ట‌ర్ ఇంకోటి.. ఇలా వేటిక‌వే చాలా అట్రాక్టివ్ గా.. క‌ల‌ర్ ఫుల్ గా ఉండి.. బ్ర‌హ్మోత్స‌వం మీద ఆస‌క్తిని మ‌రింత పెంచుతున్నాయి. 40 ఏళ్ల వ‌య‌సులోనూ పాతికేళ్ల కుర్రాడిలా మెరిసిపోతున్న మ‌హేషే ఈ పోస్ట‌ర్ల‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. మొత్తానికి బ్ర‌హ్మోత్స‌వం మీద అంచ‌నాలు ఇప్ప‌టికే ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఈ నెల 7న ఆడియో వేడుక కూడా అయిపోతే హైప్ మ‌రింత పీక్స్ కు చేర‌డం ఖాయం. మే 20 లేదా 27న సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది.